వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఐటీ పరిశ్రమకు ట్రంప్‌ను మించిన ముప్పు ఇది!

భారత ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మించి ముప్పు పొంచి ఉందా? యాంత్రీకరణ ఉద్యోగాలను ఎక్కువ ఉద్యోగాలను కొల్లగొట్టనుందా? అంటే అవుననే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బెంగళూరు/న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మించి ముప్పు పొంచి ఉందా? యాంత్రీకరణ ఉద్యోగాలను ఎక్కువ ఉద్యోగాలను కొల్లగొట్టనుందా? అంటే అవుననే అంటున్నారు.

ఐటి రంగం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆటోమేషన్‌ (యాంత్రీకరణ), ట్రంప్‌ రూపంలో ఐటి పరిశ్రమ కొత్త సవాళ్లను, భయాలను ఎదుర్కొంటోంది.

ఆటోమేషన్‌ కారణంగా వేలాది ఉద్యోగాలు గల్లంతు అవుతున్నాయని కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేషన్‌ ట్రంప్‌నకు మించిన ముప్పులా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కిందిస్థాయిలో ఉండే సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు, ఔట్ సోర్సింగ్‌ పనులు ఆటోమేషన్‌ ద్వారానే చక్కబడుతున్నాయి. వ్యయాలను తగ్గించుకోవడానికి కంపెనీలు ఆటోమేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో పని చేసే లక్షలాది మంది భవితవ్యం ప్రమాదంలో పడుతోంది.

అమెరికా కీలక మార్కెట్

అమెరికా కీలక మార్కెట్

మరోవైపు దేశీయ ఐటి రంగానికి అమెరికా కీలక మార్కెట్‌గా ఉంది. ఆ దేశంలోని నూతన వీసా నిబంధనలు పరిశ్రమకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే, దిగ్గజ ఐటి కంపెనీలు.. అమెరికా పరిపాలనా యంత్రాంగంతో లాబీయింగ్‌ను మొదలుపెట్టాయి.

వేతనాలు పెంచే పరిస్థితి లేదు

వేతనాలు పెంచే పరిస్థితి లేదు

కొత్త వీసా నిబంధనల ప్రకారం హెచ్‌1-బి వీసా కలిగి ఉన్న వారి వేతనాలను పెద్ద మొత్తంలో పెంచాల్సి ఉంటుంది. దానికి అవకాశాలు లేవు.

ఇతర మార్గాలు

ఇతర మార్గాలు

ఇంకోవైపు, ఆటోమేషన్‌ కారణంగా కొన్ని విభాగాల్లో ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గ జ కంపెనీలు ఉద్యోగుల పొట్టకొట్టకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాయి.

ఎక్కువ ఉద్యోగాలు దీని వల్లే..

ఎక్కువ ఉద్యోగాలు దీని వల్లే..

ఆటోమేషన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి. అయితే, ట్రంప్ వీసా నిబంధనలను మార్చటం వల్ల కోల్పోయే ఉద్యోగాల కన్నా ఆటోమేషన్ వల్లనే ఎక్కువ ఉద్యోగాలు పోయేలా ఉన్నాయని అంటున్నారు.

English summary
Indian IT worry about Mechanization more than America chief Donald Trump VISA changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X