కాచిగూడ నుంచి కర్ణాటక స్పెషల్- కూర్గ్, మురుడేశ్వర్ సహా అద్భుతమైన డెస్టినేషన్లు..!!
Kachiguda- Karnataka Tourist Special Train: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుంచి కొత్తగా మూడు టూర్ ప్యాకేజీలు వెలువడ్డాయి. కర్ణాటకలోని ప్రఖ్యాత పర్యాక ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రాంతాలతో కూడిన ప్యాకేజీ ఇది. కోస్టల్ కర్ణాటక, కాఫీ విత్ కర్ణాటక, మెమరీస్ ఆఫ్ మైసూర్ పేరుతో ఈ మూడూ అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ప్యాకేజీకి ఒక్కోరకమైన ఛార్జీలు, టూర్ డెస్టినేషన్లు ఇందులో ఉన్నాయి.
కోస్టల్ కర్ణాటక..
ఈ ప్యాకేజీ కింద ఉడిపి- శృంగేరి- మురుడేశ్వర్- మంగళూరు దర్శించవచ్చు. మొత్తం అయిదు రాత్రులు/ ఆరు పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ప్రతి మంగళవారం తెల్లవారు జామున 6:05 నిమిషాలకు కాచిగూడ నుండి ఈ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. దీని కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన కనిష్ట ఛార్జీ 15,970 రూపాయలు. గరిష్టంగా 41,630 రూపాయల వరకు ఉంది.

ఒకరి నుంచి ముగ్గురు ప్యాసింజర్లు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 41,630 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 23,670 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 19,000 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు అంటే 5 నుంచి 11 సంవత్సరాల లోపు వారికి రూ. 12,140, బెడ్ లేకుండా రూ. 10,740లు.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 38,600 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 20,650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 15,970 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు 9,120 రూపాయలు, బెడ్ లేకుండా 7,720 రూపాయలు.
నలుగురి నుంచి ఆరుమంది ప్యాసింజర్లు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో..సింగిల్ షేరింగ్ ఉండదు. డబుల్ షేరింగ్ కోసం 20,410 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 17,950 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 12,140, బెడ్ లేకుండా రూ. 10,740లు.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో కూడా సింగిల్ షేరింగ్ ఉండదు. డబుల్ షేరింగ్ కోసం 20,410 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 17,950 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 10,740, బెడ్ లేకుండా రూ. 7,720 రూపాయలను వసూలు చేస్తారు.
కాఫీ విత్ కర్ణాటక..
ఈ ప్యాకేజీలో మైసూరు- కూర్గ్ ఉన్నాయి. ఇది కూడా అయిదు రాత్రులు/ ఆరు పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ప్రతి బుధవారం సాయంత్రం 7:05 నిమిషాలకు కాచిగూడ నుండి ఈ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. దీని కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన కనిష్ట ఛార్జీ 13,360 రూపాయలు. గరిష్టంగా 34,900 రూపాయల వరకు ఉంది.
ఒకరి నుంచి ముగ్గురు ప్యాసింజర్లు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 34,900 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 19,980 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 15,380 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 10,930, బెడ్ లేకుండా రూ. 9,810.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. సింగిల్ షేరింగ్ ఛార్జీ ధర 32,880 రూపాయలు. డబుల్ షేరింగ్ కోసం 17,960 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 13,360 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు 8,910 రూపాయలు, బెడ్ లేకుండా 7,790 రూపాయలు.
నలుగురి నుంచి ఆరుమంది ప్యాసింజర్లు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో..సింగిల్ షేరింగ్ ఉండదు. డబుల్ షేరింగ్ కోసం 16,700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 14,010 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 10,930, బెడ్ లేకుండా రూ. 9,810.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో కూడా సింగిల్ షేరింగ్ ఉండదు. డబుల్ షేరింగ్ కోసం 14,680 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 11,990 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 8,910, బెడ్ లేకుండా రూ. 7,790 రూపాయలను వసూలు చేస్తారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications