స్కిల్ యూనివర్సిటీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కవిత
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్సిటీలో నవంబర్, 2024 నుంచి కేవలం 920 మంది విద్యార్థులు మాత్రమే శిక్షణ కోసం పేరు నమోదు చేసుకున్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రచురిస్తోందని మండిపడ్డారు.
మార్చి 20, 2026 నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య 68,680గా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కల్ని ఆ యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రచురిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ వెబ్ సైట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 21, 2026 నాటికి వెబ్ సైట్ లో 1000 మంది విద్యార్థులు అలాగే 68,935 మంది లెర్నర్స్ సందర్శించినట్లు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YISU)ప్రచురిస్తోంది.
ఇదే విషయంపై తెలంగాణ జాగృతి నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి విశ్వాసం, సమగ్రతతో పనిచేయాలని వివరించింది. వెబ్ సైట్స్ లో తప్పుడు లెక్కలతో కోట్ల మంది ప్రజలను తప్పుదారి పట్టించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇలాంటి విషయాల్లో తెలంగాణ జాగృతి ప్రజల తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు.

అలాగే రాష్ట్రంలో కేవలం 13వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని కవిత ధ్వజమెత్తారు. తాము ప్రజా బడ్జెట్ లో లేవనెత్తిన కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో పెట్టలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్ లో కేటాయింపులు లేవని తెలిపారు. బడ్జెట్ లో కేటాయింపులు చేయకున్నా.. అవకాశం దక్కని రంగాలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ప్రాధాన్యత ఇవ్వచ్చని డిమాండ్ చేశారు.
-
Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..! -
"ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీ..పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం" -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
గాయపడ్డ సింహంలా రాఘవ్ చద్దా.. ఆప్ ఆరోపణల వెనుక భారీ కుట్ర? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications