వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతాపార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు కోమటిరెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మునుగోడు ఉపఎన్నిక కోసం గొల్ల కురుమలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ మునుగోడులో నిరసనకు దిగారు. గొర్రెల పథకం పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేసిందని, ఎన్నికలు అవగానే డబ్బులు వెనక్కి తీసుకుందని రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మునుగోడులోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా వినతి పత్రం అందజేశారు. గొల్ల కురుమల ఖాతాల్లో వేసిన నగదును తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమ సోదరుల ఖాతాలకు సంబంధించిన ఫ్రీజ్ ఎత్తివేసేంతవరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. దాదాపు రెండు గంటలు ఆయన ధర్నా చేశారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా.. అకౌంట్లపై ఫ్రీజ్ ఎత్తివేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో కోమటిరెడ్డిని అరెస్ట్ చేశారు.

komatireddy rajagopal reddy arrest

నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న నగదు జమ చేసిన విషయం తెలిసిందే. లబ్ధిదారులంతా మునుగోడు వాసులే కావడంతో ఈ నగదు పంపిణీ ఆపేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎన్నికల తరువాత నగదు వాడుకోవాలని గొల్ల కురుమలకు చెప్పిన ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఎన్నికలు ముగిసి పదిరోజులవుతున్నప్పటికీ బ్యాంక్‌ ఖాతాలపై విధించిన ఫ్రీజ్ ఎత్తివేయలేదని గొల్ల కురుమలు రాజగోపాల్‌ రెడ్డికి తమ గోడును చెప్పుకోవడంతో ఆయన ఆందోళన చేసి అరెస్ట్ అయ్యారు.

English summary
Bharatiya Janata Party leader and former MLA Komatireddy Rajagopal Reddy was arrested by the police in Munugodu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X