"నేను డ్రగ్స్ టెస్ట్ కు రెడీ.. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను"
తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు చెందిన ఫామ్ హౌస్ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్ వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ రావడంతో సంచలనంగా మారింది.
అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధుల స్థానంలో ఉండి డ్రగ్స్ వాడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. డ్రగ్స్ తో పాటు ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. డ్రగ్స్ వాడుతూ.. అమ్ముతున్న వారిని రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usage
— KTR (@KTRBRS) March 15, 2026
I personally am strictly against drugs and usage of illicit substances.
My party BRS condemns usage of drugs and any illegal activities. Any one…
"అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు డ్రగ్స్ పరీక్షకు హాజరు కావాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నాను. నేను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను.. ఏ సమయమైనా నేను ఎలాంటి పరీక్షకైనా సిద్ధం.. ఏ సంబంధం లేకున్నా, నా పేరును ఈ డ్రగ్స్ కేసులలో లాగితే వారికి లీగల్ నోటీసులు ఇస్తాను" అని కేటీఆర్ స్పష్టం చేశారు.

అంతకుముందే ఇదే వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. సమాజంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరగడం అత్యంత దురదృష్టకరమని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
-
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications