మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది.
వేములవాడ: ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమను కాదని రచన ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఆమె మేనమామలైన నాగరాజు, శేఖర్, అశోక్ భరించలేకపోయారు.

గురువారం సాయంత్రం కొత్త దంపతులపై కత్తులతో దాడి చేసి వారిని హతమార్చారు. అంతేకాదు, వీరి వివాహానికి సహకరించిన వేములవాడ మండలం మారుపాకకు చెందిన మల్లేశం అనే వ్యక్తిని సైతం మట్టుబెట్టేందుకు ప్లాన్ వేశారు.
ఈ మేరకు సమాచారం అందడంతో వేములవాడ పోలీసులు మల్లేశంను తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రచన దంపతుల హత్యకు ప్రేమ వివాహమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications