కన్న కూతుళ్లతో అసభ్యంగా తండ్రి.. లైంగిక వేధింపులతో అరెస్టు..

కుమార్తెలు నిద్రిస్తున్న సమయంలో వారి పట్ల శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించడాన్ని భార్య గమనించింది.

హైదరాబాద్: కన్న కూతుళ్లనే లైంగికంగా వేధించిన ఓ తండ్రిని శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. నిద్రిస్తున్న కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కూకుట్ల శ్రీనివాస్(42) ఉబెర్ సంస్థలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 1998లో ఇతనికి వివాహం కాగా, భార్యతో పాటు 15,16 సంవత్సరాలున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య టైలరింగ్ చేస్తుండటంతో పాటు మూవీ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.

Man held for raping daughters

ఇలా సాగిపోతున్న జీవితంలో భార్యకు ఓ షాకింగ్ నిజం తెలిసింది. భర్తకు ఇదివరకే పెళ్లయిందని ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలియడంతో భర్తతో గొడవపడింది. అప్పటినుంచి శ్రీనివాస్ 5ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఏమైందో ఏమో తెలియదు గానీ ఈమధ్య ఇంటికి మళ్లీ రాకపోకలు మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చిన ప్రతీసారి రెండు మూడు రోజులు గడపటం ఆ తర్వాతి మళ్లీ వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్నాడు.

ఇదే క్రమంలో కుమార్తెలు నిద్రిస్తున్న సమయంలో వారి పట్ల శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించడాన్ని భార్య గమనించింది. చేతులతో వారి జననాంగాలను తాకడం.. లైంగికంగా వేధించడంతో పాటు విషయం తల్లికి చెప్పవద్దని వారిని బెదిరించాడు.

అయితే చిన్న కుమార్తె తల్లికి అసలు విషయం చెప్పడంతో.. అప్పటికే భర్త అసభ్య చేష్టలను పసిగట్టిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలల సంరక్షణ చట్టంలోని లైంగిక వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+