విషాదగాథ: పేదోడీ రోదన పట్టదా, కేటీఆర్ వచ్చాడని తెలిసి పరుగెత్తుకుంటూ వస్తే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన కష్టాన్ని, ఇబ్బందులను మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు చెప్పుకుందామని వస్తే పోలీసులు అడ్డుకున్నారని రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కొడుకు 11 నెలలకే గుండె సంబంధ వ్యాధితో చనిపోయాడని, అప్పట్లో బాబుకు సరైన వైద్యం అందలేదని, ఆ తర్వాత కలిగిన కుమారుడికి బోన్ క్యాన్సర్ ఉందని చెప్పాడు.

తన కుమారుడికి ఇప్పుడు తొమ్మిదేళ్లు వచ్చాయని, అతనికి వ్యాధి ఉందని, కానీ తాము ఏం చేయలేని పరిస్థితి అని, అతనిని బతికించుకోవడానికి ఎన్నో ఆసుపత్రులు తిరిగామని,
రెక్కాడితో గానీ డొక్కాడని వారు కూడా రూ.5 లక్షల దాకా ఖర్చు పెట్టారని వాపోయారు.

తాండూరుకు చెందిన రాజేందర్ రెడ్డి

తాండూరుకు చెందిన రాజేందర్ రెడ్డి

తాండూరుకు చెందిన రాజేందర్ రెడ్డి కుటుంబం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంకు వచ్చి స్థిరపడింది. గచ్చిబౌలిలో ఓ అపార్టుమెంటులో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కేన్సర్‌తో బాధపడుతున్న తన తనయుడు మదన్ రెడ్డికి వైద్యానికి రూ.30 లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. మంత్రి మహేందర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని సాయం కోరినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కార్యాలయం చుట్టు తిరిగినా

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కార్యాలయం చుట్టు తిరిగినా

ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం కార్యాలయం చుట్టు తిరిగినా అధికారులు పట్టించుకోలేదని రాజేందర్ రెడ్డి వాపోయారు. ఈ క్రమంలో మంగళవారం నల్లగండ్లలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి కేటీఆర్ వస్తున్నారని తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుందామనుకున్నాడు. కానీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పేదవాడి రోదన పట్టించుకోరా

పేదవాడి రోదన పట్టించుకోరా

పేదవాడి రోదన పట్టించుకోరా, నా కుమారుడికి ప్రాణబిక్ష పెట్టరా అని గట్టిగా ఆక్రోషం వెలిబుచ్చారు. పోలీసులు అయనను అదుపులోకి తీసుకొని కాసేపటి తర్వాత వదిలేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడారు. తన కష్టం కేటీఆర్‌ ముందు చెప్పుకొంటే ఆదుకుంటారని ఆశగా వస్తే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.

తొమ్మిది నెలల క్రితం తెలిసింది

తొమ్మిది నెలల క్రితం తెలిసింది

తన రెండో కుమారుడు మదన్ రెడ్డికి బోన్ క్యాన్సర్ అని తొమ్మిది నెలల కిందట తేలిందని రాజేందర్ రెడ్డి చెప్పారు. అతడిని నల్లగండ్ల సిటిజన్‌ ఆసుపత్రిలో చేర్చగా చికిత్సకు రూ.30లక్షలు ఖర్చవుతాయని చెప్పారని, ఇప్పటికి ఎన్నో లక్షలు ఖర్చయిందన్నారు. ఇంత మొత్తాన్ని భరించే స్థోమత లేకపోవడంతో మంత్రి మహేందర్ రెడ్డిని కలిశానన్నారు. సచివాలయానికి వెళ్లాలని ఆయన చెప్పారన్నారు.

కేటీఆర్ వచ్చాడని పరుగెత్తుకొచ్చా

కేటీఆర్ వచ్చాడని పరుగెత్తుకొచ్చా

అక్కడకి వెళ్లినా సరైన దారి దొరకలేదని, ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ ఇక్కడో కార్యక్రమానికి వచ్చారని తెలిసి కష్టం చెప్పుకొందామని పరుగెత్తుకు వచ్చానని చెప్పారు. తీరా ఇక్కడ వినతిపత్రం ఉంటేనే కలవాలంటూ పోలీసులు అడ్డుకున్నారని ఆక్రోశం వ్యక్తంచేశారు. మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వం మానవతా దృక్పథంలో స్పందించి తన కుమారుడిని కాపాడాలని వేడుకున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా రాజేందర్ రెడ్డి రోడ్డుపై పడుకొని అడ్డుకుంటానని అరుస్తూ, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుగులు పెట్టాడు. ఆ తర్వాత ఆయన తన బాధను మీడియాకు వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man from Tandoor, seeks Minister Kalvakuntla Taraka Rama rao help for his son.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి