హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరూ బాగుండాలి.!అందులో మీరుండాలి.!బల్దియా కార్మికులకు మేయర్ ఇమ్మ్యూనిటీ కిట్ ల పంపిణి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో ప్రణాలకు తెగించి విదులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికుల పట్ల ఔదార్యాన్ని చూపించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి.కరోనా మహమ్మారి కట్టడికి ఫ్రంట్ లైన్ వారియర్ గా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఇమ్మ్యూనిటీ మెడికల్ కిట్ లను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అందచేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ దాదాపు ఐదు వందల మందికి ఈ ఇమ్మ్యూనిటీ పెంపు మెడికల్ కిట్లను సోమవారం నాడు అందచేశారు.

ప్రాజెక్ట్ హోప్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో అందచేసిన ఈ మెడికల్ కిట్ లలో విటమిన్ టాబ్లెట్ లు , డీ.విటమిన్ టాబిలెట్లు, జింక్ టాబ్లెట్ లు, పారాసిటమాల్, హ్యాండ్ శానిటైసర్, మాస్కులున్నాయి. గ్రేటర్ మునిస్పల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత నిస్తున్నామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే దాదాపు 95 శాతం శానిటేషన్ సిబ్బందికి వాక్సినేషన్ పూర్తిచేశామని విజయలక్ష్మి స్పష్టం చేసారు.

Mayor distributes immunity kits to GHMC workers.!

అంతే కాకుండా సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ గ్లౌజులను కూడా అందిస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. నగరంలోని నిరాశ్రయులు, నిరు పేదలు, పలు ఆసుపత్రుల్లో ఉన్న వారి అటెండెంట్ల సౌకర్యార్థం జీహెచ్ ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతీ రోజూ లక్ష్యానికి మించి ఉచిత బోజనాలను జీహెచ్ఎంసీ అందిస్తోందని మేయర్ తెలిపారు. నగరంలోని అన్నపూర్ణ కేంద్రాల ద్వారా అందిస్తోన్న ఐదు రూపాయల భోజనాన్ని ఉచితంగా అందచేయడంతో పాటు మరో వంద కేంద్రాలను అదనంగా ఏర్పాటుచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారని జీహెచ్ఎంసీ ఆ దిశగా కార్యాచరణ రూపొందింస్తోందని తెలిపారు.

దీంతో ప్రస్తుతం నగర పరిధిలో జీహెచ్ ఎంసీ నిర్వహిస్తోన్న అన్నపూర్ణ కేంద్రాలకు తోడు మరికొన్ని అదనంగా కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వీటితో పాటు సర్కిల్ కు ఒక్కటి చొప్పున ఒక ప్రత్యేక కేంద్రం ఓపెన్ చేసి బాక్స్ లలో ఉంచిన భోజనాన్ని ఆయా సర్కిళ్లలో వీధుల్లో తలదాచుకునే వారికి సంబంధిత ఏ.ఎం.హెచ్.ఓ ల ఆధ్వర్యంలో అందచేస్తున్నట్ట మేయర్ గద్వాల వివజయలక్ష్మి స్పష్టం చేసారు.

English summary
Mayor Vijayalakshmi showed generosity towards the GHMC workers who were relentless in their efforts during the Corona crisis. City Mayor handed over special immunity medical kits to GHMC workers working as front line warriors for the Corona pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X