ఆత్మహత్యచేసుకొందామనుకొంటే బతికింది, పాముకాటు నుండి రక్షించిన కుక్క

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: ఓ పాము రెండు సార్లు ఓ వృద్దురాలిని కాటేసేందుకు ప్రయత్నిస్తే కానీ, ఆమెను పెంపుడు కుక్క కాపాడింది. అయితే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. అయితే ఆమె చావునుండి తప్పించుకొంది.

వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లెకు చెందిన సుగుణమ్మకు 65 ఏళ్ళు. ఆమె భర్త కొమ్మయ్య రెండేళ్ళ క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు.వారికి వివాహం చేసింది. వారు అత్తగారింట్లో ఉంటున్నారు.

 A miracle incident happend in Warangal rural district


ఒంటరితనంతో పాటు అనారోగ్యం బాధిస్తుండడంతో సుగుణమ్మ ఆత్మహత్య చేసుకోవాలని శుక్రవారం రాత్రి గ్రామంలోని వ్యవసాయబావిలో దూకింది. కానీ, బావిలో నీరు తక్కువగా ఉండడంతో గాయాలతో బయటపడింది.

అయితే అదే బావిలో రెండు రోజుల క్రితం పాము పడింది.అయితే నీళ్ళలో పడిన పాము బయటకు రాలేక ఇబ్బందిపడుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన సాదమల్లయ్య పెంపుడు కుక్క కూడ శుక్రవారం మధ్యాహ్నం అదే బావిలో పడిపోయింది. సుగుణమ్మ బావిలో దూకే సమయానికి ఈ రెండు బావిలో ఉన్నాయి.

గాయాలతో కదల్లేని స్థితిలో ఉన్న సుగుణమ్మను పాము, కుక్కతోపాటు రాత్రంతా గడిపాయి. అయితే తెల్లవారిన తర్వాత సహయం కోసం ఆమె కేకలు వేసింది. ఆ అరుపులు విన్న స్థానికులు ఆమెను కాపాడారు.

ఈ అరుపులకు భయపడిన పాము రెండుసార్లు ఆమెను కాటేసేందుకు ప్రయత్నించింది. అయితే కానీ, అక్కడే ఉన్న కుక్క ఆమెను రక్షించింది. బుసలు కొడుతున్న పామును నోటితో పట్టుకొని దూరంగా విసిరేసింది.

ఈ క్రమంలోనే అది పాముకాటుకు గురైంది. సుగుణమ్మకు రక్షణగా అక్కడే ఉంది. ఎటూ కదలకుండా అక్కడే నిలబడింది. ఆమెను కాపాడేందుకు వచ్చినవారు కూడ ఈ దృశ్యాన్ని చూసీ ఆశ్చర్యపోయారు. మంచానికి నాలుగువైపులా తాళ్ళుకట్టి బావిలోకి దించి ఆమెను కాపాడారు. అనంతసరం కుక్కను కూడ పైకిలాగారు. అయితే కుక్కకు వైద్యం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A miracle incident happend in Warangal rural district on Friday night.A dog rescue 65 year old Sugunamma from snake bite.villagers rescued Sugunamma and dog.
Please Wait while comments are loading...