ఇక దోపిడికి చెల్లు?,థియేటర్లలో ధరలపై ఉపేక్షించకండి, ఒక్క ఫోన్ కాల్.. : అకున్ సబర్వాల్
Recommended Video

హైదరాబాద్: సినిమా హాళ్లలో తినుబండారాల పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. సినిమా టికెట్ కంటే కొన్నిసార్లు వీటికే ఎక్కువ సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఎమ్మార్పీకి పొంతన లేని రేటుతో ఇష్టా రీతిన ధరలు పెంచేసి అమ్ముతున్నారు. అటు అధికారులు కూడా ఇన్నాళ్లు పట్టీ లేనట్టుగా వ్యవహరించడంతో వీరి వ్యాపారం బాగానే కళకళలాడింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడంతో వీరి బండారం బయటపడింది.

ఎమ్మార్పీ కంటే అధిక ధరలు:
నగరంలోని చాలా మల్టీప్లెక్స్ లలో తినుబండారాలను ఎమ్మార్పీ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చిప్స్ ప్యాకెట్స్, కుర్‌కురే వంటి ప్యాకెట్ల క్వాంటిటీ కూడా తగ్గినట్టు అధికారుల తనిఖీల్లో బయట పడింది.100 గ్రాముల ప్యాకెట్‌ను తూకం వేస్తే కొన్నిచోట్ల 90 గ్రాములే ఉంది. లూజ్‌గా అమ్ముతున్న పాప్‌కార్న్‌ను రూ.150కి విక్రయిస్తున్నారు.

రోజుకు రూ.40వేల దోపిడీ..:
అధికారుల తనిఖీల్లో కొన్ని థియేటర్లలో వేయింగ్ మిషన్‌ను కూడా ట్యాంపర్ చేసినట్టు గుర్తించారు. మొత్తం 15టీమ్స్ తో తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సభర్వాల్ ఈ తనిఖీలు చేయించారు. తనిఖీల నేపథ్యంలో
ఒక్క రోజులోనే 105కేసులు నమోదవడం గమనార్హం.
ప్యాకేజ్ తో కాకుండా విడిగా(లూజ్) అమ్ముతున్న తినుబండారాలపై భారీ ఎత్తున దోచుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్కో థియేటర్ లో రోజుకు కనీసం రూ.10వేలు, గరిష్టంగా రూ.40వేల వరకు వీటిపైనే దోపిడీ జరుగుతున్నట్టు తేల్చారు.

చట్టరీత్యా నేరం..:
తూనికలు కొలతల శాఖ నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ ఉత్పత్తులు ఏవైనా వాటిపై ముద్రించే ఎమ్మార్పీ ధరకే అమ్మాలి. అలా కాకుండా అధిక ధరలకు అమ్మినా, క్వాంటిటీ తగ్గించినా వినియోగ దారుల హక్కుల చట్టం -1986 ప్రకారం అది నేరంగా పరిగణిస్తారు. అయితే విడిగా(లూజ్)విక్రయించే తినుబండారాలకు సంబంధించి స్పష్టమైన ధరల నిబంధనలేవి లేకపోవడంతో.. థియేటర్ నిర్వాహకులకు అది వరంగా మారింది.

ఈ నంబర్ కి ఫోన్ చేయండి:
ఐనాక్స్, ప్రసాద్ ఐమాక్స్, జీవీకే, ఇనార్బిట్, ఫోరం మాల్, ఐకాన్ హైటెక్ సిటీ, లియోనియా కార్నివాల్, ఏషియన్ జీపీఆర్, పీవీఆర్, సినీ పొలీస్, సీసీపీఎల్ కార్నివాల్, పీవీఆర్ ఐకాన్ హైటెక్ సిటీ, దిల్‌సుక్‌నగర్ మిరాజ్ థియేటర్, ఏషియన్ మల్టీప్లెక్స్, మహేశ్వరి, పీవీఆర్ నెక్ట్స్ గలేరియా, ఏషియన్ జీపీఆర్ కూకట్‌పల్లి తదితర థియేటర్లలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. ఏ థియేటర్‌లో అయినా ఎమ్మార్పీ కంటే అధిక రేట్లు వసూలు చేసినా.. ఎమ్మార్పీ లేకుండా విక్రయించినా, ఇతర మోసాలను గుర్తించినా 73307 74444 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications