మామ ఆశయాన్ని నెరవేరుస్తా: నారా బ్రాహ్మణి

Subscribe to Oneindia Telugu

నల్గొండ: తన మామ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశయాన్ని నెరవేరుస్తామని నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం మామ చంద్రబాబునాయుడు ఏ ఆశయంతో, ఉద్దేశంతో హెరిటేజ్ సంస్థను స్థాపించారో వాటికి అనుగుణంగా సంస్థను నడుపుతున్నామని తెలిపారు.

వేడుకల్లో..

వేడుకల్లో..

బుధవారం నార్కట్‌పల్లిలోని హెరిటేజ్ కంపెనీలో రజోత్సవం వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె మాట్లాడారు.

6వేల కోట్ల టర్నోవర్..

6వేల కోట్ల టర్నోవర్..

ఐదేళ్లలో హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారాన్ని రూ.6వేల కోట్ల టర్నోవర్‌కు చేర్చి, 6లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి పాల సేకరణ చేయడమే లక్ష్యమని ఆ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న నారా బ్రాహ్మణి తెలిపారు.

ఆనందం.. ఆరోగ్యం..

ఆనందం.. ఆరోగ్యం..

వినియోగదారుల ఆనందం, ఆరోగ్యం ధ్యేయంగా నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ హెరిటెజ్‌ ఫుడ్స్‌ కంపెనీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామనిబ్రాహ్మణి అన్నారు.

చెక్కుల అందజేత..

చెక్కుల అందజేత..

ఈ సందర్భంగా గేదెలకు సంబంధించిన చెక్కులను రైతులకు అందజేశారు. రైతులకు పాల క్యాన్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులు సత్యనారాయణ, నర్సింగ్‌రావు, హరిప్రసాద్‌, దూబె, రాజు, శ్రీశైలం, రమేష్‌, సంతోష్‌, కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heritage Company Executive Director Nara Brahmani on Wednesday visited Narketpally and participated silver jubilee celebrations of heritage company.
Please Wait while comments are loading...