ఈ కలయిక ఇష్టం లేదు!: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, కేటీఆర్‌పై విమర్శ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేటీఆర్-నేను రాజకీయాలు సహా ఎన్నో విషయాలు మాట్లాడాం: పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చూసిన కేటీఆర్... పవన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడీ ఫోటో చుట్టూ సరికొత్త రాజకీయం నడుస్తోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎక్కువ మంది వారిద్దరి కలయికను స్వాగతిస్తున్నారు.

కానీ కొందరు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పవన్‌తో కలిసి ఫోటో దిగటం ఏమిటని తెలంగాణవాదులు కొందరు కేటీఆర్‌ను తప్పుబడుతున్నారు. తెరాసతో పవన్‌కు గతంలో పొసగకపోవడమే ఈ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.

ఎన్నోసార్లు విమర్శించారు

ఎన్నోసార్లు విమర్శించారు

అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ కుటుంబంలోని నాయకులు పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఓ సందర్భంలో కేసీఆర్.. పవన్ కళ్యాణ్ పేరును కూడా పక్కనున్న నేతలను అడిగి తెలుసుకుని మరీ విమర్శించారు.

అంతలా విబేధించి..

అంతలా విబేధించి..

కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత కూడా పవన్ కళ్యాణ్‌పై గతంలో వాక్భాణాలు సంధించారు. అంతలా విభేదించిన కుటుంబ సభ్యుల్లో ఒకరైన కేటీఆర్ ఇలా పవన్‌‌తో కలిసి ఫోటో దిగడమేంటని కొందరు తెలంగాణ ప్రాంతానికి చెందిన నెటిజన్లు ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను విమర్శిస్తున్నారు.

ఈ కలయిక ఇష్టం లేదు!

ఈ కలయిక ఇష్టం లేదు!

ఈ వ్యవహారంపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలు ఈ కలయికను ఇష్టపడటం లేదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారిలో పవన్ కూడా ఒకరని చెప్పాడు. అలాంటి వ్యక్తితో సెల్ఫీ దిగడానికి కేటీఆర్ ఆసక్తి చూపడం తమకు నచ్చలేదన్నాడు.

అందుకే..

అందుకే..

అయితే కొందరు నెటిజన్లు మాత్రం కేటీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, టెక్స్‌టైల్ శాఖా మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ అభిమానంతోనే ఫోటో దిగారంటున్నారు. ఇరువురి సదభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలని మరికొందరు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Netizens differs with Telangana Minister KT Rama Rao on Jana Sena chief Pawan Kalyan pic.
Please Wait while comments are loading...