Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిల్లల్లో కరోనా కొత్త లక్షణాల గుర్తింపు; గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చేరిన ఐదుగురు చిన్నారులు

కరోనా మహమ్మారి భారతదేశంలో తన పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా కరోనా మహమ్మారి కేసులు విజృంభిస్తున్నాయి. తేలికపాటి లక్షణాలతో ఒమిక్రాన్ కొనసాగుతున్నా ముందు ముందు దీని ప్రభావం ఏవిధంగా ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పిల్లల పైన కూడా కరోనా ప్రభావం చూపిస్తుంది.

పిల్లలపై కరోనా ప్రభావం ..కొత్త లక్షణాలు గుర్తింపు

పిల్లలపై కరోనా ప్రభావం ..కొత్త లక్షణాలు గుర్తింపు

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి పిల్లలపై ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరోనా మహమ్మారి బారిన పడిన పిల్లలు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒకటి, రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపునొప్పి రావడంతో పాటు వాంతులు, విరోచనాలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డెల్టా వేరియంట్ తో బాధ పడిన పిల్లలలో కడుపునొప్పి, తలనొప్పి ఉండేది కాదని, కానీ ప్రస్తుతం కరోనా బారిన పడిన పిల్లలలో కడుపు నొప్పి, తలనొప్పి విపరీతంగా ఉంటుందని చెప్తున్నారు.

కడుపునొప్పి, తలనొప్పితో చిన్నారులలో లక్షణాలు

కడుపునొప్పి, తలనొప్పితో చిన్నారులలో లక్షణాలు

సహజంగా కరోనా మహమ్మారి బారిన పడిన పిల్లలు సహజంగా జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాకుండా కొత్తగా కడుపునొప్పి, తలనొప్పి తో కూడా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులలో ఏ మాత్రం ఈ లక్షణాలు కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా పరీక్షలు చేయించి అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా మూడవ దశలో 5 సంవత్సరాల లోపు పిల్లల పై కూడా ప్రభావం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

5 ఏళ్ళ పిల్లలపైనా ప్రభావం

5 ఏళ్ళ పిల్లలపైనా ప్రభావం

ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మాస్కులు పెట్టినా వారు ఉంచుకోరని కిందకి లాగేసి ఉంటారని, దీంతో వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు టీకాలు ఇంకా అందుబాటులోకి రాని కారణంగా చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం తల్లిదండ్రులకు ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో ఐదుగురు పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఐదుగురు చిన్నారులకు కరోనా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స

ఐదుగురు చిన్నారులకు కరోనా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స

వీరిలో ఇద్దరికి ఆక్సిజన్ తో చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు ఇతర సమస్యలతో చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో 23 నుండి 30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు. ఇండియాలో కూడా పిల్లలు ఒమిక్రాన్ బారిన పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101, 102 డిగ్రీల జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. తస్మాత్ జాగ్రత్త అని వార్న్ చేస్తున్నారు వైద్య నిపుణులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+