హైదరాబాద్ విధ్వంసానికి ఐసిస్ కుట్ర: అజ్మీర్‌లో ఉగ్రవాదుల మకాం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాదులో తమ చేతికి చిక్కిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు అజ్మీర్‌లో కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించారని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ గుర్తించింది. దీంతో తమకు ఇటీవల పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదులను ఇద్దరిని తీసుకుని వెళ్లి అజ్మీర్‌లో సోదాలు చేశారు.

హైద్రాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర: మరో ఇద్దరు అరెస్ట్

అజ్మీర్‌లో ఐసిస్ అనుమానితులు రెక్కీ నిర్వహించారని, అక్కడ దర్బార్ ప్యాలెస్‌లో మకాం వేశారని ఎన్ఐఎ అధికారులు గుర్తించినట్లు సమాచారం. సిరియాకు చెందిన ఐఎస్ఐఎస్ నాయకుడితో అక్కడి నుంచి వీరు మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు.

NIA finds ISIS suspects stayed at Ajmeer

ఐసిస్ చీఫ్ సూచనల మేరకే వారు ఇక్కడ మకాం వేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఎన్ఐఎ అధికారులు తమ చేతుల్లో ఉన్న అనుమానితుల నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. దర్బార్ ప్యాలెస్ నుంచి సిసిటివీ కెమెరా దృశ్యాలను ఎన్ఐఎ అధికారులు సేకరించారు.

హైద్రాబాద్‌లో 'కొత్త'వ్యూహంతో విధ్వంసంకు ఐసిస్ ప్లాన్

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోనూ మహారాష్ట్రలోని నాందేడ్‌లోనూ ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐసిస్ అనుమానితులు దేశంలో ఎక్కడెక్కడ మకాం వేశారు, ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్ఐఎ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎక్కడెక్కడ కొన్నారనే విషయాన్ని కూడా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that the ISIS suspects arrested in Hyderabad have stayed in Ajmeer to implement their plan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి