హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సౌదీ' భారీ పరిహారం: మృతుల్లో బోధన్ వాసి, ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మక్కామసీదులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారికి సౌదీ ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన బాధితులకు ఒక్కోక్కరికి రూ. 1.76 కోట్లు (ఒక మిలియన్ సౌదీ రియాళ్లు) పరిహారంగా ఇవ్వాలని సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాలు జారీ చేశారని ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ప్రమాదంలో శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వారికి సైతం ఇంతే మొత్తాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ప్రమాదంలో గాయపడ్డ వారికి మాత్రం రూ.88.35 లక్షల(5 లక్షల రియాళ్లు) చొప్పున పరిహారంగా అందించాలని రాజు ఆదేశించినట్లు పేర్కొంది.

 'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

మక్కా మసీదులో శుక్రవారం మక్కా మసీదులో భారీ క్రేన్ కూలడంతో 107 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మంది భారతీయులు (వీరిలో నలుగురు ఏపీ వాసులు) మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే. మృతుల్లో బోధన్‌కు చెందిన షేక్ హైదర్ అలీ ఖాద్రీ (65) అనే వ్యక్తి ఉన్నాడు.

'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

క్రేన్ కూలి జరిగిన ప్రమాదంలో అతను మరణించాడు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు హైదరాబాదీలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌కు చెందిన షేక్‌ ముజీబ్‌, బజార్‌ఘాట్‌కు చెందిన అనీఫ్‌ దంపతులకు గాయాలయ్యాయని తెలంగాణ హజ్‌ కమిటీ అధికారులు తెలిపారు.
'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌ కూలిపోయింది. 230 మందికి గాయాలయ్యాయి. మసీదులో క్రేన్ కూలిన ఘటన దైవ ఘటన అంటూ మక్కాలో అభివృద్ధి పనులు చేపడుతున్న సౌదీ బిన్‌లాడిన్ సంస్థ ఇంజినీర్ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రేన్ కూలడానికి సాంకేతిక తప్పిదాలు కారణం కాదన్నారు.
'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహాం వ్యక్తం చేసిన సౌదీ రాజు ప్రమాదానికి కారణమైన సౌదీ బిన్ లాడెన్ గ్రూపుపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సౌదీ బిన్‌లాడిన్ సంస్థ అల్‌కాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబానికి చెందినది.
ఈ కంపెనీలో పనిచేస్తున్న 60 వేల మందిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు.
'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

'సౌదీ' భారీ పరిహారం: ఒక్కొ బాధితుడికి 1.76 కోట్లు

సౌదీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న భారతీయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

English summary
11 people who died in Mecca tragedy have been identified as Moniza Ahmed, Muameena Ismail, Mohd Hanif, Tabassum, Hassan Kharaj, Zafar Sheikh, Zakira Begum, Mohammed Abdul Khadar, Fatima Begum, Shameem Bano and Khader Bee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X