హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన: భారీగా ట్రాఫిక్ జామ్, ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజాం కాలేజీ విద్యార్థులు సోమవారం బషీర్‌బాగ్ చౌరస్తాలో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌కు వ్యతిరకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

ఒక్కసారిగా విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. అయితే, అందుకు విద్యార్థులు అంగీకరించలేదు.

 Nizam college students protest at basheerbagh chowrasta

హాస్టల్ సదుపాయంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు రోడ్డుపై పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

కాలేజీలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడంపై విద్యార్థులు మండిపడ్డారు. హాస్టల్ వసతిని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వసతి లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ప్రిన్సిపాల్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు వినతి పత్రం ఇస్తే నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామి ఇచ్చారు. అయితే, హాస్టల్ వసతి కల్పనపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనను కొనసాగించారు. దీంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకోవడం కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత విద్యార్థులు తమ ఆందోళనలను కాలేజీ లోపల కొనసాగించారు.

English summary
Nizam college students protest at basheerbagh chowrasta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X