బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నాటక ఎన్నికలు-కన్ఫ్యూజింగ్: ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ ఆసక్తికరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు హంగ్ వస్తాయని తెలిపాయి. రెండు మూడు సర్వేలు మాత్రం బీజేపీ లేదా కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్‌లో వస్తున్న కర్నాటక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను అర్థం చేసుకోవడం కంటే కన్ఫ్యూజ్ అయ్యే విషయం మరొకటి లేదని పేర్కొన్నారు. రెండు చానల్స్ బీజేపీ అంటుంటే, మరో రెండు ఛానల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని, మరికొన్ని హంగ్ వస్తున్నాయని చెబుతున్నాయని పేర్కొన్నారు.

Nothing can be more confusing than watching the Karnataka exit poll: KTR

కాగా, శనివారం ఓటింగ్ ముగియగానే వెల్లడైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఉత్కంఠకు తెరలేపాయి. ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నట్లు తేల్చాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేలా ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చని స్పష్టం చేశాయి.

పోలింగ్‌కు ముందు జరిపిన సర్వే ఫలితాలకూ వీటికి పెద్ద వ్యత్యాసం లేదు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌, బీజేపీలు పోటాపోటీగా ఉన్నా మొగ్గు బీజేపీ వైపే ఉంది. జేడీ(ఎస్‌) అన్ని సర్వేల్లోనూ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ భవిష్యత్‌ రాజకీయ సమీకరణాల్లో మునిగి తేలుతున్నాయి.

తాజా పరిస్థితుల్లో జేడీ(ఎస్‌) కింగ్‌ మేకర్‌ కావడం ఖాయమని భావిస్తున్నారు. ఒకటి రెండు సర్వేలు చెప్పినట్లే బీజేపీ లేదా కాంగ్రెస్‌కు మార్జిన్‌కు దగ్గరగా సీట్లు వస్తే మాత్రం స్వతంత్ర అభ్యర్థులు మద్దతిచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జేడీఎస్ కీలకంగా మారే అవకాశాలు లేవు.

English summary
'Nothing can be more confusing than watching the Karnataka exit poll predictions on English news channels. Two channels calling it for BJP & two others to Congress. Looks like the exit polls are hung too' KTR tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X