హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇరిటేట్ చేశారా: రేవంత్‌పై పవన్ కళ్యాణ్ తేలిగ్గా? 'పవర్' పంచ్‌లివీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 తదితర అంశాలపై సోమవారం స్పందించారు. ఆయన ఏం చెబుతారు? అనే ఆసక్తి అందరిలోను కనిపించిన విషయం తెలిసిందే.

ఓటుకు నోటు కేసులో స్పందించేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదు. అది కోర్టు పరిధిలో ఉన్నందున దానిని కోర్టు తేలుస్తుందని ఆయన చెప్పారు. ఓటుకు నోటుపై ప్రశ్నిస్తే.. అది కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.

అంతేకాదు, ఏ పార్టీలోను నిజాయితీపరులు లేరని, ప్రజల కంటే పార్టీ ప్రయోజనాలో ముఖ్యమయ్యాయని, ఉన్న వాటిల్లో మంచి పార్టీతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని అంత సీరియస్‌గా భావించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందనే వాదన వినిపిస్తోంది. సాధారణంగా ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు.

ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు... అని జనం నిలదీసే సరకి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారని, ముందుగా సీఎం కేసీఆర్‌ను ఒక మాటలో పొగిడారని, యాదగిరి నరసింహ స్వామి ఆయం డిజైన్ చేయడానికి ఆంధ్రా వ్యక్తని నియమించి తెలుగు జాతి ఐకమత్యానికి కృషి చేస్తున్నందుకు కేసీఆర్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారని నమస్తే తెలంగాణ వెబ్ సైట్లో పేర్కొంది.

Pawan Kalyan opinion on Revanth Reddy issue!

చివరలో మాత్రం.. మొత్తం మీద వెనకది ముందుకు, ముందుది వెనకు మాట్లాడుతూ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడి అందరినీ కాస్త ఇరిటేట్ చేశాడని పేర్కొంది.. ఒక్కటి మాత్రం స్ఫష్టంగా చెప్పాడని, తెలంగాణ ఎంపీలను ఆదర్శంగా తీసుకుని ఏపీ ప్రత్యేక హోదాకు పోరాటం చేయాలని ఆంధ్రా ఎంపీలను, ఇతర రాజకీయ పార్టీ నేతలకు సూచించారని పేర్కొంది.

ప్రెస్ మీట్‌లో పవర్ పంచ్‌లు

సీమాంధ్ర రాజధాని నిర్మాణం జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దు.
హైదరాబాద్ పైన హక్కుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించవద్దు.
కొత్త రాజధాని నిర్మాణం, పాలన పైన దృష్టి పెట్టాలి. హైదరాబాద్, తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
సెక్షన్ 8కు నేను వ్యతిరేకం.
ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్ అంశం.
అందరు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం మాట్లాడటం లేదు. తిడితే కెసిఆర్‌లా తిట్టాలి, పడితో పౌరుషం లేని ఏపీ ఎంపీల్లా పడాలి. ఉత్తరాది ఎంపీలతో కొట్టించుకొని బయటకొచ్చారు. ఏపీ ఎంపీలకు పౌరుషం, ఆత్మగౌరవం లేవా అనిపిస్తోంది.
రాజకీయ నాయకులకు నోరు పారేసుకోవడమే తెలుసు. నేను తక్కువగా మాట్లాడుతా. నా అభిప్రాయాలు నాకున్నాయి.
ప్రజా సమస్యలు వదిలి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారు. అంతర్యుద్ధానికి దారి తీసే ప్రమాదం.
మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం హరించొద్దు.
ఎమర్జెన్సీ సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛ మీద నియంత్రణ విధిస్తే రాంనాథ్ గోయెంకా సంపాదకీయం స్థానంలో తెల్ల కాగితం వదిలేసి ప్రచురించారు.
కేశినేని నాని తనకు ఎంపీ సీటు కావాలని బలంగా ఊగిపోయారు. ఇప్పుడేం చేస్తున్నారు. పార్లమెంటు గోడలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారా, ప్రత్యేక హోదా కోసం ఏమైనా చేస్తున్నారా.
రాజధాని ఇచ్చి తెలంగాణను సంతోషపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు.
విభజన సమస్యలు తీర్చాల్సిన వాళ్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఇబ్బంది.
అందరి కళ్లలోను దూలాలున్నాయి. సైజు మాత్రం తేడా.
హైదరాబాద్ తెలంగాణ రాజధాని. అందులో తిరుగులేదు. ఏపీ రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి. ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపాలు చేయవద్దు.
ఎన్డీయే, యూపీఏలు ఓ కమిటీ వేసి తెలుగు రాష్ట్రాల వ్యవహారాలు పరిశీలించాలి. బాబు చెప్పిన సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ మార్గాలను సూచించాలి.
ఉద్యమం సమయంలో కెసిఆర్ ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. పదేపదే ఆంధ్రొళ్లు, సెటిలర్లు అనొద్దు. నన్ను లేదా చంద్రబాబును తిట్టుకోవచ్చు. హరీష్ రావు ఎక్కువగా ఈ పదాలు వాడుతున్నారు.
ఏపీకి ఎలాగు అన్యాయం జరిగింది. ఇప్పుడు సెక్షన్ 8 పెట్టి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు.
హైదరాబాద్ 60 ఏళ్ల పాటు ఆంధ్రులకు రాజధాని. ఇప్పుడు కొత్త రాజధాని కట్టేందుకు డబ్బులు లేవు.
ఒక కంట్లో వెన్న, మరో కంట్లో సున్నం పెట్టినట్లుంది.
ఓ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తారా. సీబీఐ విచారణ జరిపించాలి.
విజయనగరం జిల్లాకు చెందిన సాయిని యాదాద్రి ఆర్కిటెక్చర్‌గా పెట్టారు. తెలుగు వారి ఐక్యతకు కెసిఆర్ తొలి అడుగు.
వ్యవస్థలు కొట్టుకుంటే అంతర్యుద్ధం.
నాకు రాజకీయాలు కొత్త.
ప్రజా సమస్యలు మానేసి కోర్టులు, ఏసీబీ కేసులు సరికాదు.
తలసాని టీఆర్ఎస్‌లోకి వెళ్లారు కానీ సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తీసుకెళ్లగలరా.
నేటి రాజకీయాల్లో నీతి, నిజాయితీ, విలువలే లేవు.
విభజన నేపథ్యంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి.
తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యేక దేశం కాదు.. భారత దేశంలో అంతర్భాగం.
చంద్రబాబుపై కేసు నమోదయినంత మాత్రాన సెక్షన్ 8 రాదు.
సొంత వ్యాపారాల కోసం ఎంపీలుగా ఉండొద్దు.
ఏ పార్టీలోను నిజాయితీపరులు లేరు. ప్రజల కంటే పార్టీ ప్రయోజనాలో ముఖ్యమయ్యాయి. ఉన్నవాటిల్లో మంచి పార్టీతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి.

English summary
Pawan Kalyan opinion on Revanth Reddy issue!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X