వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"పవన్ కు నిజంగా ఆ కమిట్ మెంట్ ఉందా?"

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పార్టీ పెట్టి రెండేళ్లయినా.. ఇప్పటి వరకు పవన్ స్టాండ్ ఏంటనేది ఎవరికీ అర్థం కాని విషయం. అదలా ఉంటే.. సామాజిక కోణంలో పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావనకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో ముద్రగడ లాంటి నేతలు కాపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తోన్న తరుణంలోను.. కాపు వర్గానికే చెందిన వ్యక్తి అయినప్పటికీ పవన్ ఆ విషయంలో ఎప్పుడూ కలగజేసుకోలేదు.

దీంతో కాపు సామాజిక వర్గమంతా పవన్ పట్ల ఒకింత గుర్రుగానే ఉంది. అడపాదడపా ఆ అసంతృప్తులు బయటపడుతుండగా.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ ఈ విషయంలో పవన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాపుల కోసం ముద్రగడ చేస్తోన్న పోరాటానికి పవన్ ఎందుకు మద్దతు పలకట్లేదని ప్రశ్నించారు వీహెచ్. ఏళ్లుగా రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తోన్న కాపులకు పవన్ లాంటి వ్యక్తుల మద్దతు అవసరం అన్న తరహాలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

'మొన్నటిదాకా మాట్లాడలేదు, కాపు సమస్యలపై నోరు విప్పలేదు, జబర్దస్త్ గా డైలాగులైతే చెబుతాడు..' అంటూ పవన్ గురించి కాస్త సెటైరికల్ గా మాట్లాడారు వీహెచ్. పవన్ నిజంగా కమిట్ మెంట్ ఉన్న వ్యక్తే గనుక అయి ఉంటే.. ముద్రగడ నిరాహారదీక్ష చేస్తోన్న సమయంలో కనీసం ఒక్కరోజు కూడా పవన్ ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పలకరించలేదని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలకు మద్దతు తెలుపుతూ.. కాపుల్లో ఐక్యత లేకుండా చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు వీహెచ్.

పవన్ కమిట్ మెంట్ ను ప్రశ్నిస్తూ.. ముద్రగడకు ఉన్న కమిట్ మెంట్ పవన్ కు ఉందా? అంటూ ప్రశ్నించారు వీహెచ్. పవన్ విడగొట్టడానికి పనికొచ్చేవాడే గానీ కలపడానికి కాదని పేర్కొన్నారు. మరి వీహెచ్ వ్యాఖ్యల పట్ల జనసేనాని స్పందిస్తారా! అనుమానమే.

English summary
Telangana congress leader V hanumantarao was fired on Janasena president Pawan kalyan for not supporting kapu moment leading by mudragada in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X