వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చండూరులో చీకట్లోనో పోలింగ్.. చౌటుప్పల్‌లో క్యూ లైన్‌లో వంద మంది

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. కానీ సాయంత్రం 6 గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే ఇప్పటికీ క్యూ లైన్లలో వయోజనులు బారులు తీరారు. మధ్యాహ్నాం 2 గంటలు.. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల వద్దకు జనం వచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి రావడంతో.. క్యూ లైన్లలో జనం ఉన్నారు.

చండూరు ప్రాథమిక పాఠశాలలో చీకట్లోనే పోలింగ్ జరుగుతుంది. జనం ఇబ్బంది పడుతూనే తమ ఓటు హక్కును యూజ్ చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం ముగిసి గంట సేపు అయినా.. జనం ర్యాష్ ఉంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు దాదాపు 100 మంది వరకు ఉన్నారు. ఇంకా చాలా చోట్ల జనం ఉన్నారు.

polling continue in chandur without light

పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను నల్గొండ జల్లా కేంద్రంలో గల కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ భారీ భద్రత ఉంటుంది. ఈ నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు 2018లో మునుగోడులో 91 శాతం వరకు ఓటింగ్ జరిగింది. ఈ సారి అదీ 93 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. జనం ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారంటే.. సందేహాం వస్తోంది. బీజేపీ వైపు గాలి వీస్తోందా.. లేదంటే కారు జోరు కొనసాగుతుందా అనే సందేహాం కలుగుతుంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూడా రాత్రి వరకు జనం ఉండి మరీ ఓటు వేశారు. అదీ చంద్రబాబుపై వ్యతిరేకత కనిపించింది. వైసీపీకి భారీ మెజార్టీ వచ్చింది. మరీ మునుగోడు బై పోల్ ఏం జరగనుందో చూడాలీ మరీ.

English summary
polling continue in chandur without light and choutuppal polling centre 100 people are standing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X