రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.!యవ్వారం బాగా ముదిరింది.!చివరికి జరిగేది అదేనా.?
దేశంలో పరిపాలనా వ్యవస్ధ, రాజ్యాంగ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి రెండు కళ్లుగా వ్యవహరిస్తుంటారు రాజకీయ మేధావులు. రాజకీయ వ్యవస్ధలను సరైన గాడిలో నడపడానికి ఈ రెండు వ్యవస్ధలు కీలక భూమిక పోషిస్ధాయంటారు.
హైదరాబాద్ : గొడ్డొచ్చిన వేళ, ఇంటికి కోడలొచ్చిన వేళ అనే నానుడిని జరిగే శుభాలను బట్టి సంభోదిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ వచ్చిన వేళ అనే కొత్త అంశం పట్ల కూడా తాజాగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ బాద్యతలు చేపట్టిన దగ్గరనుండి ప్రభుత్వంతో అనుకోని వివాదాలు వెలుగుచూస్తున్నాయి. అనేక అంశాల్లో కావాలనే గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తుంటే గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం చులకనగా చూస్తుందంటున్నారు గవర్నర్.

సీఎం వర్సెస్ గవర్నర్..
గత కొంత కాలంగా గవర్నర్ వ్యవస్థకు ముఖ్యమంత్రికి ఊహించని దూరం పెరిగింది. ప్రజల పాలిట సమఉజ్జీలుగా వ్యవహరించాల్సిన వ్యవస్ధలు వారిలో వారే వివాదాలకు కారణమైతే పరిస్దితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సహజంగా ఏ గవర్నర్ ఐనా నా ప్రభుత్వం, నా సంక్షేమ పథకాలు అని అభివర్ణిస్తుంటారు. కానీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఇప్పటి వరకూ అలా సంభోదించే అవకాశం రాలేదంటే రాజ్ భవన్ తో పాటు, ప్రగతి భవన్ ఎంత వైషమ్యంతో రగిలిపోతుందో అర్ధం చేసుకోవచ్చు.

ముదిరిన వివాదాలు..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక మొదలు కొని స్వాతంత్ర్య దినోత్పవ, ఘనతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ వరకూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు గవర్నర్. కొన్ని సందర్బాల్లో ప్రభుత్వ ప్రతిపాదలకు సంబంధించిన దస్తావేజులపై సంతకం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు గవర్నర్ పై విరుచుకుపడిన సందర్బాలు కూడా ఉన్నాయి. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేసిన గవర్నర్ విధానాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి.

విభేదాలు తారా స్దాయికి..
అంతే కాకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాజ్ భవన్ లో నిర్వహించాలన్న తమిళిసై సౌందరరాజన్ ప్రతిపాదనకు సీఎం చంద్రశేఖర్ రావు ఎలాంటి సుముఖత వ్యక్తం చేయక పోగా ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో సీఎం కు గవర్నర్ కు మరింత గ్యాప్ పెరిగినట్టయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ ఉద్యోగులు ఫోన్లను ట్యాప్ చేసి అప్రజాస్వామిక పద్దతిలో విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వంలోని కొంత మంది ప్రయత్నించారని స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
తాజాగా ఘణతంత్ర్య వేడుకలను పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం విముఖత చూపడం, కోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ వేడుకలను నిర్వహించడం కూడా ప్రభుత్వానికి శరాఘాతంగా పరిణమించింది. ఇక అత్యంత కీలకంగా జరిగే బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ ప్రారంభోపన్యాసం పట్ల కూడా గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కు తగ్గింది. అంతే కాకుండా ఫిబ్రవరి మూడో తారీఖున ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను ఫిబ్రవరి ఆరో తారీఖున ప్రవేశపెట్టబోతున్నట్టు పేర్కొంది. దీంతో గవర్నర్ వ్యవస్దకు, ప్రభుత్వానికి వివాదాలు బాగా ముదిరినట్టు చర్చ జరుగుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications