హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ విల్లాలో దోపిడీ, బాలికపై రేప్: కళ్లు గప్పి ఖైదీ పరార్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దొంగతనం, లైంగిక దాడి కేసులో కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకుని వచ్చిన ఓ నిందితుడు జైలు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకు పారిపోయాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాదు ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టు వద్ద చోటు చేసుకొంది.

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాకు చెందిన అరుణ్‌శర్మ (20) మే 24వ తేదీన నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిపేట్ సమీపంలోని గేటెడ్ కమ్యూనిటీ టెక్కీ విల్లాలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం చేయడంతో పాటు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Rape accused flees from cops

అతడికి బుబల్ పురాన్ అనే వ్యక్తి సహకరించగా ఇద్దరిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని మంగళవారం రాజేంద్రనగర్‌లోని 23వ ఎం.ఎం కోర్టుకు హాజరుపర్చి తిరిగి జైలుకు తీసుకేళ్లే క్రమంలో అరుణ్‌శర్మ తప్పించుకున్నాడు.

జైలు సిబ్బంది పట్టుకొనేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిందితుడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. జీషన్ పాల్‌ను వెంటాడి పట్టుకోగా, పరారైన అరుణ్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాన్పూర్‌లో చిన్నపాటి దొంగతనాలు చేసిన వారిద్దరు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. మే 14వ తేదీన వారు విల్లాలోకి ప్రవేశించి అపిల్ మ్యాక్‌బుక్, నోకియా సెల్‌ఫోన్, ఆపిల్ ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్ దొంగిలించారు. వాటిని ఎత్తుకుని పారిపోతున్న సమయంలో బాలిక కేకలు వేసింది.

వారిద్దరు ఆమెను పట్టుకుని కొట్టి చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత ఆమెను ఇంటి పెరటిలోకి తీసుకుని వెళ్లి కత్తితో బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారిని పోలీసులు మే 25వ తేదీన అరెస్టు చేశారు.

English summary
An undertrial prisoner accused of raping a child and robbery at a techie's villa in Gandipet a month ago, escaped when he was brought to court on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X