ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

Posted By:
Subscribe to Oneindia Telugu
  టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకుని, కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్ | Oneindia Telugu

  హైదరాబాద్: టిడిపి తెలంగాణ శాసనససభపక్ష నేత రేవంత్‌రెడ్డి వెనక్కు తగ్గారు. శాసనసభపక్ష సమావేశం నిర్వహించడాన్ని విరమించుకొన్నారు. మరోవైపు టిడిఎల్పీ కార్యాలయంలోని కంప్యూటర్‌ను ఫైళ్ళను రేవంత్‌రెడ్డి తీసుకెళ్ళారు. రేవంత్‌‌ను ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారని ఎల్. రమణ ప్రకటించిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తన ఫైళ్ళను తీసుకెళ్లారు. అదే సమయంలో అసెంబ్లీలో టిడిఎల్పీకి కేటాయించిన గదిని తీసుకొనేందుకు అసెంబ్లీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

  తెలంగాణ టిడిపి శాసనసభపక్ష సమావేశాన్ని నిర్వహించి తీరుతామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి కాస్త వెనక్కు గ్గారు. పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినతి మేరకు రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకొన్నారు.

  చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ సమావేశం నిర్వహించకుండా టిడిపి నాయకత్వం చర్యలు తీసుకొంది.

  రేవంత్‌రెడ్డి చిచ్చు: మొదటి నుండి చంద్రబాబు ఇలాగే

  రేవంత్‌రెడ్డిని పార్టీలోని అన్ని పదవుల నుండి తప్పించాలని ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ చంద్రబాబునాయుడును కోరారు. చంద్రబాబు సూచన మేరకే రేవంత్‌రెడ్డిని టిడిఎల్పీ సమావేశం నిర్వహించకూడదని ఎల్. రమణ ఆదేశాలు జారీ చేశారు.

  కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్‌రెడ్డి

  కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్‌రెడ్డి

  టిడిఎల్పీ కార్యాలయంలో కంప్యూటర్‌, తన ఫైళ్ళను గురువారం ఉదయం పూట రేవంత్‌రెడ్డి తీసుకెళ్ళారు. టిడిఎల్పీ నేతగా ఉన్న సమయంలో తన కార్యాలయంలో కేటాయించిన కంప్యూటర్‌‌తో పాటు, ఫైళ్ళను రేవంత్‌రెడ్డి తీసుకెళ్ళడం ప్రాధాన్యతను సంతరించుకొంది. తనపై వేటేసేందుకు రంగం సిద్దం చేసిందనే సంకేతాలు ఇచ్చిన తరుణంలో రేవంత్‌రెడ్డి తన కంప్యూటర్‌ను , ఫైళ్ళను తీసుకెళ్ళారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  టిడిఎల్పీలో బి గదిని తీసుకొనే యోచనలో అసెంబ్లీ అధికారులు

  టిడిఎల్పీలో బి గదిని తీసుకొనే యోచనలో అసెంబ్లీ అధికారులు

  టిడిఎల్పీలో బి గదిని తీసుకొనే యోచనలో అసెంబ్లీ అధికారులు ఉన్నారు. టిడిఎల్పీ‌కి ప్రస్తుతం రెండు గదులున్నాయి. గతంలో టిడిఎల్పీ కార్యాలయం కేటాయింపు విషయంలో అసెంబ్లీ అధికారుల తీరుపై రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. అయితే అదే తరుణంలో టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతమున్న గదుల్లో బి గదిని అసెంబ్లీ అధికారులు తీసుకొనే యోచనలో ఉన్నారని సమాచారం.గతంలోనే టిడిఎల్పీకి కేటాయించిన రెండు గదులను కూడ కమిటీలకు కేటాయించారు.

  రేవంత్ వ్యూహత్మకంగానే వెనక్కు తగ్గారా?

  రేవంత్ వ్యూహత్మకంగానే వెనక్కు తగ్గారా?

  టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకొని గురువారం నాడు స్వదేశానికి తిరిగిరానున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిఎల్పీ సమావేశం నిర్వహణ విషయమై సండ్ర వెంకటవీరయ్య వినతి మేరకు రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకొన్నారు. అయితే టిడిఎల్పీ సమావేశాన్ని రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగానే రద్దు చేసుకొన్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

  గోల్కోండ సమావేశానికి రేవంత్ డుమ్మా

  గోల్కోండ సమావేశానికి రేవంత్ డుమ్మా

  గోల్కొండ హోటల్‌లో నిర్వహించే టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల సమావేశానికి రేవంత్‌రెడ్డి గైరాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశానికి రేవంత్‌కు ఆహ్వనం పంపినట్టుగా టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమావేశం గురించి తనకు సమాచారం తెలియదని రేవంత్ ప్రకటించారు. సండ్ర వెంకటవీరయ్య, ఆర్.‌కృష్ణయ్యలు గోల్కొండ హోటల్‌లో నిర్వహించే సమావేశానికి హజరుకానున్నారు. అయితే రేవంత్ నిర్వహించే సమావేశానికి హజరుకాకపోయేవారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రేవంత్ టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకొన్నారని సమాచారం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TTDLP leader Revanth Reddy broght computer and files from TDLP office on Thursday morning.Revanth Reddy not a TDLP leader said TDP President L. Ramana.Assembly officers planning to takeover B room from TDLP.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి