రేవంత్ Vs సుమన్: రేేవంత్‌కు టిఆర్ఎస్ మెలిక, 'చర్చకు నేను రెడీ'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విద్యుత్ విషయమై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డితో చర్చకు సిద్దమని ప్రకటించిన టిఆర్ఎస్ గురువారం నాడు మాట మార్చింది. ఏ మాత్రం విశ్వసనీయత లేని రేవంత్ రెడ్డితో చర్చకు తాము సిద్దంగా లేమని ఆ పార్టీ ప్రకటించింది.

సుమన్ సవాల్‌‌కు రేవంత్ సై: జనవరి 12న, చర్చకు రెఢీ, ఎవరు ముక్కు రాస్తారో చూద్దాం

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా, సీఎల్పీ నేత జానారెడ్డి లాంటి నేతలు చర్చకు వస్తే తాము చర్చకు సిద్దమని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రకటించారు.గురువారం నాడు టిఆర్ఎస్ ఎంపీ సుమన్ మీడియాతో మాట్లాడారు.

తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, విద్యుత్‌పై చర్చకు నేను రెఢీ: రేవంత్‌కు సుమన్ సవాల్

విద్యుత్ ఒప్పందాల విషయమై తెలంగాణ ప్రభుత్వం చీకటి ఒప్పందాలను చేసుకొందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలపై తాను టిఆర్ఎస్ నేతలతో చర్చకు సిద్దమేనని రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు.

దివాళా కంపెనీలతో ఒప్పందాలు, మాట వినలేదని ఐఎఎస్‌లను తప్పించారు: కెసిఆర్‌పై రేవంత్ సంచలనం

అయితే ఈ విషయమై రేవంత్ రెడ్డితో తాము చర్చకు సిద్దమని బాల్క సుమన్ ప్రకటించారు. బుదవారం నాడు ఈ విషయమై సమయం, తేదిని చెప్పాలని బాల్క సుమన్ ప్రకటించారు.

రేవంత్ రెడ్డి చెబుతున్న విషయాలన్నీ కూడ అవాస్తవాలను తాను నిరూపించేందుకు సిద్దమని బాల్క సుమన్ ప్రకటించారు.అయితే ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి బుదవారం రాత్రి స్పందించారు. జనవరి 12న, తేదిన 2 గంటల సమయంలో చర్చకు రెడీ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

విశ్వసనీయత లేని రేవంత్‌తో చర్చకు సిద్దంగా లేం

విశ్వసనీయత లేని రేవంత్‌తో చర్చకు సిద్దంగా లేం

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డికి విశ్వసనీయత లేదని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు.ఏమాత్రం విశ్వసనీయత లేని రేవంత్ రెడ్డితో చర్చిస్తే ఉపయోగం లేదని అన్నారు. విశ్వసనీయత ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదా సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.విశ్వసనీయత ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదా సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

చర్చకు ఎవరో వస్తారో కాంగ్రెస్ నేతలు తేల్చుకోవాలి

చర్చకు ఎవరో వస్తారో కాంగ్రెస్ నేతలు తేల్చుకోవాలి

విద్యుత్ విషయమై సిఎల్పీ డిప్యూటీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయమై కూడ టిఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చకు ఎవరో వస్తారో ముందు తేల్చుకోవాలని హితవు పలికారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.

చర్చకు నేను సిద్దం

చర్చకు నేను సిద్దం

విద్యుత్ విషయమై టిఆర్ఎస్ సవాల్ కు తాను సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం మరోసారి ప్రకటించారు.తనతో చర్చకు సిద్దమని బుదవారం నాడు ప్రకటించిన టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఎందుకు వెనక్కు వెళ్ళారో చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు. పార్టీ అనుమతితోనే తాను చర్చకు సిద్దమని ప్రకటించినట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

టిఆర్ఎస్ నేతల కోసం ఎదురు చూస్తా

టిఆర్ఎస్ నేతల కోసం ఎదురు చూస్తా

టిఆర్ఎస్ నేతల కోసం తాను చెప్పిన సమయంలో చర్చ కోసం ఎదురు చూస్తానని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాను లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పే ధైర్యం టిఆర్ఎస్ నేతల వద్ద లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే టిఆర్ఎస్ నేతలు మరో వాదనను తెరమీదికి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.విద్యుత్ రంగంలో అవినీతిపై చర్చకు తేదీ, సమయం నిర్ణయించామని, పాలకపక్షం తోకముడిచి పారిపోయిందని, అది పారిపోయినా వదిలిపెట్టమని, రేపటి ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Trs Mp Balka suman said that We are not ready to discuss with Congress leader Revanth Reddy. We are ready to discuss with TPCC president Uttamkumar Reddy, or CLP leader Jana Reddy . Suman spoke to media on Thursday at Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి