వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెలికాప్టర్‌లో పొగలు: కేసీఆర్-కేకే-స్మితాసబర్వాల్ ఎక్కిన తర్వాత అంతా 5 నిమిషాల్లోనే గందరగోళం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Breaking : CM KCR Escapes Helicopter Mishap, Video

హైదరాబాద్/అదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ప్రమాదం తప్పింది. అదిలాబాద్ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన హెలికాప్టర్ నుంచి పొగలు వచ్చిన విషయం తెలిసింది.

హెలికాప్టర్‌లో పొగలు రావడంపై విచారణ జరుపుతున్నామని డీజీపీ మంగళవారం తెలిపారు. భద్రతా సిబ్బందికి చెందిన వైర్లెస్ సెట్‌లో పొగలు వచ్చినట్లు గుర్తించారని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామన్నారు.

కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో పొగలు, ఏం జరిగిందంటే? కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో పొగలు, ఏం జరిగిందంటే?

పొగలు రావడంతో గందరగోళం

పొగలు రావడంతో గందరగోళం

కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సు సోమవారం కరీంనగర్‌లో నిర్వహించారు. సోమవారం రాత్రి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని తన నివాసంలో కేసీఆర్ బస చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో కారులో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని హెలికాప్టర్‌ ఎక్కారు.

కేకే, స్మితా సబర్వాల్, సంతోష్ రావు ఎక్కిన తర్వాత

కేకే, స్మితా సబర్వాల్, సంతోష్ రావు ఎక్కిన తర్వాత

మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపీ కేశవరావు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ రావు, సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్‌ కాసేపటికి హెలికాప్టర్‌లో ఎక్కారు. ఇద్దరు పైలట్లు హెలికాప్టర్‌ ఇంజిన్‌ను స్టార్ట్‌ చేయగా, సహాయకులు హెలికాప్టర్‌ తలుపులు, ఇతర భాగాలను సరి చూస్తున్నారు.

తలుపులు మూయలేదు

తలుపులు మూయలేదు

ఆ సమయానికి వెనక భాగంలోని తలుపు మూయలేదు. అదే సమయంలో అక్కడ ఉన్న భద్రతా అధికారి ఒక్కసారిగా లోపల ఉన్న ఓ నల్లటి బ్యాగును చేతిలోకి తీసుకుని పది అడుగుల దూరం వరకు పరుగెత్తారు. సంచిలో నుంచి పొగలు రావడంతో భద్రతాధికారులంతా ఆందోళనకు గురయ్యారు.

దూరంగా పడేశారు

దూరంగా పడేశారు

అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు పరుగెత్తుకుంటూ వచ్చి అధికారి చేతిలో ఉన్న సంచిని పట్టుకొని హెలిప్యాడ్‌కు చాలా దూరంగా పడేశారు. ఈ క్రమంలో హెలిపాడ్‌ చుట్టూ ఉన్న భద్రతాధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఆ తర్వాత వెనుక డోర్ మూసేశారు

ఆ తర్వాత వెనుక డోర్ మూసేశారు

ఓ పైలట్‌ దిగి వెనక భాగంలో ఉన్న తలుపును మూసేశారు. ఇదంతా కేవలం నాలుగైదు నుంచి పది నిమిషాల్లోనే జరిగింది. ఆ తర్వాత హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. మరీ ముఖ్యంగా ఓ నాలుగైదు నిమిషాలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజాప్రతినిధులు ఉత్కంఠకు లోనయ్యారు. సీఎం భద్రతకు సంబంధించిన కమ్యూనికేషన్‌ కిట్‌ బ్యాగులో ఉండే బ్యాటరీ తీగలు షార్ట్‌ సర్య్కూట్‌కు రావడంతో పొగలు వచ్చాయని పోలీసులు గుర్తించారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao who is touring Adilabad, Peddapalli and Mancherial districts today sent the security into jitters after smoke emitted from a bag in the helicopter he was travelling in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X