హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేముల రోహిత్ ఎఫెక్ట్: వీసికి షాకిచ్చిన విద్యార్థి, ఆయన చేత్తో నో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా, శనివారం నాడు స్నాతకోత్సవం సందర్భంగా ఓ సంఘటన చోటు చేసుకుంది.

హెచ్‌సియు వీసీ అప్పారావు చేతుల మీదుగా పట్టా తీసుకోనని ఓ పరిశోధక విద్యార్థి అభ్యంతరం తెలిపారు. ఇది చర్చనీయాంశంమైంది. వేదిక పై నుంచి వ్యాఖ్యాత పరిశోధక విద్యార్థి సుంకన్నను పట్టా తీసుకోవడానికి ఆహ్వానించారు.

అందరిలాగే వేదిక పైకి చేరుకున్న సుంకన్న.. వీసీ నుంచి పట్టా తీసుకోవడానికి నిరాకరించారు. వేదిక పైకి వచ్చిన అతను పట్టా తీసుకోకుండా అలాగే నిలుచుండి పోయాడు. వేదిక పైన ఉన్న సుంకన్నతో ప్రోవీసీ శ్రీవాత్సవ మాట్లాడారు.

వీసీ అప్పారావు నుంచి తాను పట్టా తీసుకోనని చెప్పారు. ఆయన నుంచి తప్ప ఎవరి నుంచి అయినా తీసుకుంటానని తెలిపారు. దీంతో శ్రీవాత్సవ వచ్చి పట్టా అందించారు. రోహిత్ ఘటన నాటి నుంచి వీసీ అప్పారావును ఆ పదవి నుంచి తొలగించాలని కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

అప్పారావు నుంచి పట్టా తీసుకోవడానికి నిరాకరించిన సుంకన్న మాట్లాడుతూ.. వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తాను పట్టా తీసుకోవడానికి నిరాకరించటానని చెప్పాడు. పట్టా తన చేతుల మీదుగా తీసుకోకపోవడం అన్నది విద్యార్థి ఇష్టమని, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సింది లేదని వీసీ అప్పారావు చెప్పారు.

వేముల రోహిత్

వేముల రోహిత్

వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా, శనివారం నాడు స్నాతకోత్సవం సందర్భంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. హెచ్‌సియు వీసీ అప్పారావు చేతుల మీదుగా పట్టా తీసుకోనని ఓ పరిశోధక విద్యార్థి అభ్యంతరం తెలిపారు.

పట్టా తీసుకున్న విద్యార్థినులు

పట్టా తీసుకున్న విద్యార్థినులు

శనివారం నాడు భాగ్యనగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టాలు తీసుకున్న విద్యార్థినులు.

ఆనందం

ఆనందం

శనివారం నాడు భాగ్యనగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టాలు తీసుకున్న విద్యార్థినుల ఆనందం.

సంతోషం

సంతోషం

శనివారం నాడు భాగ్యనగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం జరిగింది. పట్టాలు తీసుకున్న విద్యార్థినుల ఆనందం దృశ్యం.

English summary
Velpula Sunkanna, the research scholar from University of Hyderabad (UoH), who along with PhD student Rohith Vemula and others were suspended from the university hostel last year, on Saturday refused to accept his doctorate degree from Vice-Chancellor Appa Rao Podile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X