వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు ఏరోనాటికల్ వర్సిటీ: వరంగల్‌లోనూ టీ హబ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు కొలువైన భాగ్యనగరంలో తాజాగా విద్యారంగంలోనూ అంతర్జాతీయ సంస్థను తన ఒడిలో చేర్చుకుంటోంది. ‘ది హార్వర్డ్‌ ఆఫ్‌ ది స్కై'గా పిలుచుకునే ప్రపంచ ప్రఖ్యాత ఎంబ్రి రిడిల్‌ ఏరోనాటికల్‌ విశ్వవిద్యాలయం కోర్సులు హైదరాబాద్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి.

ఇందుకు సంబంధించి అమెరికాలోని ఈ విశ్వవిద్యాలయంతో తెలంగాణ విజ్ఞాన నైపుణ్యాభివృద్ధి సంస్థ (టాస్క్‌) శుక్రవారం ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిసింది. సింగపూర్‌లో జరుగుతున్న ఎయిర్‌షో సందర్భంగా ఈ ఒప్పందం జరగనుంది. ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న ఈ ఎంబ్రి రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీని ఏరోస్పేస్‌ రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా పరిగణిస్తారు.

Also Read: పెళ్లైన మూడ్రోజులకే పరారైన ఎన్నారై: ఫారెన్‌లో ఇలాగే చేస్తామని...!

హైదరాబాద్‌లోని ఏరోస్పేస్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే అనేక సంస్థలు ముందుకు వచ్చిన దృష్ట్యా ఆయా రంగానికి కావల్సిన నాణ్యమైన మానవ వనరులను తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటోంది.

Students learn of opportunities abroad

1926లో ఫ్లైయింగ్‌ స్కూల్‌గా ఆరంభమై శాఖోపశాఖలుగా విస్తరించి ఫ్లోరిడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎంబ్రి రిడిల్‌ ఏరోనాటికల్‌ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా 125 దేశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా కోర్సులు నిర్వహిస్తోంది. అయితే ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా.. అమెరికా బయట మరో కేంద్రం ఏర్పాటు చేయాలని భావించిన ఈ విశ్వవిద్యాలయం ఇటీవలే సింగపూర్‌లో ప్రాంగణం (క్యాంపస్‌) ఆరంభించింది.

అనంతరం చైనా, భారత్‌లపై ప్రధానంగా దృష్టిసారించింది. భారత్‌లో అన్ని ప్రధాన పట్టణాలను పరిశీలించాక, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాల చట్టం తీసుకురాని కారణంగా.. ప్రస్తుతం తెలంగాణలో టాస్క్‌ ద్వారా కోర్సులను, మాడ్యూల్స్‌ను అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించాక ఇక్కడే పూర్తిస్థాయి విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలన్నది ఎంబ్రి రిడిల్‌ ఆలోచనని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

వరంగల్‌లోనూ టీ హబ్

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఐటీ కంపెనీలు ఇక ద్వితీయశ్రేణి నగరాలకూ విస్తరించనున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందుకున్న ఐటీ పరిశ్రమలు ద్వితీ య శ్రేణి నగరాల్లోనూ కంపెనీలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే వరంగల్, హైదరాబాద్ 163వ జాతీయ రహదారిపై మడికొండ సెజ్‌లో రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించనున్నారు.

ప్రత్యేక రాయితీలు

హైదరాబాద్‌లాంటి నగరాలతో పోలిస్తే ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలకు 25శాతం దాకా ఖర్చు ఆదా అవుతుందని చెప్పటంతో పాటు అనేక రాయితీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రత్యేక రాయితీలపై ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.

- తొలుత వచ్చే ఐదు కంపెనీలకు మూడేళ్ళపాటు మున్సిపల్‌ పన్నుల నుంచి మినహాయింపు
- ఐటీ ఈవెంట్లు ఏమైనా చేస్తే రూ.5లక్షలు లేదా వాటికయ్యే ఖర్చులో సగం (ఏది తక్కువైతే అది) ప్రభుత్వమే సమకూరుస్తుంది.
- కంపెనీ పని ఆరంభించిన నాటి నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్‌ బిల్లుల తిరిగి చెల్లింపు.
- ద్వితీయశ్రేణి నగరాల్లో టాస్క్‌తో కలసి కంపెనీలకు కావల్సిన నిపుణులైన మానవ వనరుల తయారు.
- కంపెనీలు తెలంగాణలోని కాలేజీల విద్యార్థులకు ఉద్యోగాలిస్తే... ప్రతి నియామకానికి రూ.20వేల చొప్పున (50 మందికి) టాస్క్‌ ద్వారా సహకారం అందజేస్తారు.
- 250కిపైగా ఐటీ ఉద్యోగాలు, 500కుపైగా ఐటీ ఆధారిత ఉద్యోగాలిచ్చే తొలి ఐదు సంస్థలకు రూ.10లక్షల దాకా రాయితీని ప్రభుత్వం ఇస్తుంది.
- గ్రామీణ ప్రాంతాల్లో బీపీఓలు ఆరంభించే సంస్థలకు మూలధనంలో 50శాతం (గరిష్ఠంగా రూ.20లక్షలు) ప్రభుత్వం రాయితీ కింద అందజేస్తుంది.
- మూడునెలలపాటు ప్రతి ఉద్యోగికి శిక్షణ రాయితీ కింద నెలకు రూ.2,500.
-ఇంటర్నెట్, టెలిఫోన్ చార్జీలపై 25శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది.
-ఎస్డీ, ఈఎండీ, టెండర్ డాక్యుమెంట్లపై 100శాతం రాయితీ ఇవ్వనున్నారు.

English summary
It said that Embry Riddle Aeronautical University will set up in Hyderabad soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X