ఆ ఫోటోలు సునీతవో కావో తెలియదు: భర్త సురేందర్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివాహేతర సంబంధం కేసులో సస్పెండైన ఎఎస్పీ సునీతారెడ్డి సురేందర్ రెడ్డితో వివాహం చేసుకోవడానికి ముందే మరో వ్యక్తితో వివాహమైందని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంపై ఆమె భర్త సురేందర్ రెడ్డి స్పందించారు.

ఈ ఫోటోలను చూసిన ఆమె భర్త సురేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆ ఫోటోలో ఉన్నది సునీతేనా? అన్న సందేహం వ్యక్తం చేశారు.

 Surender reddy responded on ACB ASP Sunitha Reddy first marriage

ఓ యాంకర్ సోదరుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సునీత దాదాపు పదేళ్ల క్రితం వివాహం చేసుకుందనే విషయానికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి. ఈ ఫోటోలను చూసిన సురేందర్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ ఫోటోలు అసలువో,నకిలీవో తేలాల్సి ఉందన్నారు. ఈ విషయమై పబ్లిసీటీ చేయకూడదని సురేందర్ రెడ్డి మీడియాను కోరారు. ఎఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున్ రెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆమె భర్త సురేందర్ రెడ్డి బట్టబయలు చేశారు.దీంతో వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకొంది. ఈ తరుణంలో ఈ ఫోటోలు వెలుగు చూడడంతో సురేందర్ రెడ్డి స్పందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ACB ASP Sunitha Reddy husband Surender Reddy responded on first marriage on Monday

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి