హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండే సెకన్లు: 109 రోజుల తర్వాత టెక్కీ నిఖిల్ నించున్నాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: పొడుగు పెరగడానికి కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి 109 రోజుల తర్వాత తన కాళ్లపై తాను నించున్నాడు. అయితే అది కూడా రెండు సెకన్లు మాత్రమే. నరికిన కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అతను తన కాళ్లపై శుక్రవారంనాడు నించున్నాడు.

ఆ రెండు సెకన్లు కూడా అతను వాకర్ సాయం తీసుకున్నాడు. ఆపరేషన్ తర్వాత నిఖిల్ రెడ్డిని తన కాళ్లపై తాను నిలబడేలా చేయడానికి సర్జన్ డాక్ట్ర జి. చంద్రభూషన్ తొలిసారి ప్రయత్నం చేశాడు. హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్‌కు ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.

పొడుగు పెరగడానికి శస్త్ర చికిత్స చేసిన చోట ఉన్న గ్యాప్‌లో ఎముక పెరగలేదని, దాంతో శరీరం బరువును కాళ్లు మోయలేకపోతున్నాయని, వాకర్ సాయం తీసుకున్నప్పటికీ నొప్పిని నిఖిల్ భరించలేకపోతున్నాడని నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

తల్లిదండ్రులకు చెప్పకుండా నిఖిల్‌తో అంగీకార పత్రం రాయించుకుని గ్లోబల్ ఆస్పత్రిలో పొడుగు పెంచడానికి కాళ్లు నరికి వైద్యులు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి దర్యాప్తు చేపట్టింది.

ఎత్తు పెరగడానికి...

ఎత్తు పెరగడానికి...

ఎత్తు పెరగడానికి టెక్కీ నిఖిల్ రెడ్డి హైదారబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో తల్లిదండ్రులకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. చివరకు తెలిసే సరికి అంతా అయిపోయింది.

వివాదంగా మారింది...

వివాదంగా మారింది...

నిఖిల్ రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఎత్తు పెరిగేందుకు కాళ్లు నరికి శస్త్ర చికిత్స చేయడం వివాదంగా మారింది. తండ్రి గ్లోబల్ ఆస్పత్రిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

కిషన్ రెడ్డి పరామర్శ

కిషన్ రెడ్డి పరామర్శ

గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరగడానికి కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డిని బిజెపి శాసనసభ్యుడు కిషన్ రెడ్డి అప్పట్లో పరామర్శించారు.

విహెచ్ ధర్నా...

విహెచ్ ధర్నా...

నిఖిల్ రెడ్డి ఎత్తు పెంచడానికి అతనికి గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేయడాన్ని నిరిసస్తూ కాంగ్రెసు నేత వి. హనుమంతరావు అప్పట్లో ఆందోళనకు కూడా దిగారు.

English summary
Exactly 109 days after undergoing the controversial limb-lengthening surgery, 22-year-old techie Nikhil Reddy made a feeble attempt to stand on his own feet on Friday, but his 'broken' legs could hold him only for two seconds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X