వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షా 49,446 కోట్లతో తెలంగాణ బడ్జెట్, తలసరి అప్పెంతో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీలో 2017 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రవేశపెట్టారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో 2017 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రవేశపెట్టారు. ఈసారి నూతన పద్ధతులను అవలంభించామన్నారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. నాల్గోసారి బడ్జెట్ ప్రవేశపెడుతుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సమావేశాలను బుధవారానికి వాయిదా వేశారు. ఇది ఇలా ఉండగా, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అయితే, సభ్యులకు బడ్జెట్ ప్రతులు ఇవ్వకపోవడంపై షబ్బీర్ అలీ, ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు

-లక్షా 49,446 కోట్లతో తెలంగాణ బడ్జెట్
-రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 19.61కోట్లు
-ప్రగతి పద్దు రూ.88, 038 కోట్లు
-ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ. 4571 కోట్లు
-నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
-రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 55,360 కోట్లు
-మిషన్ భాగీరత రూ.3వేల కోట్లు
-పరిశ్రమలకు రూ.985కోట్లు
-ఐటీ రంగానికి రూ. 252 కోట్లు

-పర్యాటక, సాంస్కృతిక రంగాలకు రూ. 198కోట్లు
-గ్రేటర్ వరంగల్ కు రూ.300 కోట్లు
-పట్టణాభివృద్ధికి రూ. 55,99కోట్లు
-జీహెచ్ఎంసీకి రూ. 1000కోట్లు
-మిగితా కార్పొరేషన్లకు రూ.400 కోట్లు
-వైద్య ఆరోగ్య రంగాలకు రూ. 5,976 కోట్లు
-హరితహారానికి రూ. 50కోట్లు
-శాంతి భద్రతలకు రూ.4828 కోట్లు
-జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30కోట్లు
- పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723కోట్లు

Telangana budget 2017 introduced in assembly

-శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు

-చివరి విడత రైతుల రుణ మాఫీకి రూ.4వేల కోట్లు
-మైనార్టీల సంక్షేమం కోసం రూ. 1,249కోట్లు
-రహదారుల అభివృద్ధి కోసం రూ. 5,033కోట్లు

-ఫీజు రీఎంబర్స్ మెంట్ రూ. 1,339కోట్లు
-బీసీ సంక్షేమం కోసం రూ. 5,070కోట్లు
-చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.1,200కోట్లు

-ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు
-ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు

-చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ.4203కోట్లు
-బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 100కోట్లు

-వ్యవసాయ రంగానికి రూ. 5,942 కోట్లు
-నీటిపారుదల రంగానికి రూ. 23,675 కోట్లు
-రజక, నాయిబ్రహ్ముణులకు రూ. 500 కోట్లు
-కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అర్హులకు రూ. 51 వేల నుంచి రూ. 75,116కు పెంపు

-ఆసరా పింఛన్ల కోసం రూ. 5330కోట్లు
-తలసరి ఆదాయం పెరుగుదల 12.6శాతం
-తలసరి ఆదాయం రూ. 1,58,368

-ఎస్సీ, ఎస్టీలకు 9600 ఎకరాలు కేటాయించాం
-ఎస్సీ, ఎస్టీల కోసం 130 గురుకులాలను ఏర్పాటు చేశాం
-జర్నలిస్టులకు హెల్త్ కార్డులు సహా ఆర్థిక సాయం అందిస్తున్నాం

-సాగుకు పగటి పూటే 9గంటల విద్యుత్ ఇస్తున్నాం
-పారిశ్రామిక, గృహ అవసరాలకు 24గంటల విద్యుత్ ఇస్తున్నాం
-విదేశాల్లో పేద విద్యార్థుల చదువుల కోసం రూ. 20లక్షలు ఇస్తున్నాం
-రాష్ట్రలో సైనిక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం

-పారిశుధ్య కార్మికుల వేతనం రూ. 12,500కు పెంచాం
-మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్యాకేజీ ప్రకటించాం
-అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు నేరుగా నిధులు అందిస్తున్నాం
-ఆస్పత్రుల్లో మందుల కోసం నిధులను రెట్టింపు చేశాం
-3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం

-గతేడాది వాహనాల పన్ను ఆదాయం రూ. 2899 కోట్ల అంచనా
-గతేడాది వాహనాల పన్ను రూపంలో వసూలైన ఆదాయం రూ. 2,585 కోట్లు
-ఈ ఏడాది వాహనాల పన్ను ఆదాయ లక్ష్యం రూ. 3000 కోట్లు
-ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం అంచనా రూ. 36,237 కోట్లు

-ఇతర మార్గాల్లో సమకూర్చుకోనున్న కొత్త అప్పులు రూ. 26,400 కోట్లు
-కేంద్రప్రభుత్వ రుణరూపంలో రూ. 1000 కోట్లు
-తలసరి అప్పు రూ. 40,149 కోట్లు
-మొత్తం రాష్ట్ర అప్పు రూ. 1,40,523 కోట్లు
-2016-17లో రాష్ట్ర అప్పు రూ. 1,14,813 కోట్లు
-రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51

-ఓయూ సెంటినరీ ఉత్సవాలకు రూ. 200 కోట్లు
-అంగన్ వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం

-గతేడాది అమ్మకం పన్ను అంచనాల్లో భారీగా తగ్గుదల
-అమ్మకం పన్ను అంచనాల్లో రూ. 6 వేల కోట్లకు తగ్గుదల
-గతేడాది అమ్మకం పన్నుల లక్ష్యం రూ. 42,073 కోట్ల అంచనా
-గతేడాది అమ్మకం పన్ను వసూళ్లు రూ. 37,439 కోట్లు
-గతేడాది రిజిస్ర్టేషన్ల ఆదాయం లక్ష్యం రూ. 4,291 కోట్లు
-రిజిస్ర్టేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4041 కోట్లు
-ఈ ఏడాది రిజిస్ర్టేషన్ల ఆదాయం లక్ష్యం తగ్గింపు, రూ. 3 వేల కోట్ల అంచనా
-గతేడాది ఎక్సైజ్ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 5083 కోట్లు
-ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం అంచనా రూ. 8,999 కోట్లు

-వచ్చే రెండేళ్లలో 4 లక్షల యాదవుల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తాం
-75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ
-మూసీ ప్రక్షాళనకు రూ. 350 కోట్లు

-కేసీఆర్ కిట్ కోసం రూ. 605 కోట్లు కేటాయింపు
-శిశువుకు ఉపయోగపడే 16 వస్తువులతో కేసీఆర్ కిట్
-ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలు ప్రసవం అనంతరం రూ. 12వేలు ఇస్తాం
-డిశ్చార్జి అయిన వెంబడే రూ. 4వేలు
-శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4 వేలు
-మొత్తంగా మూడు విడతల్లో రూ. 12 వేలు ఇస్తాం
-ఆడబిడ్డ పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తాం

-శిశువుకు అవసరమయ్యే 16 వస్తువులతో కూడిన కిట్‌ పంపిణీ.

-ఒంటరి మహిళలకూ ఆసరా ఫించన్లు వర్తింపు.
-మూసీ నది ప్రక్షాళనకు రూ.3,060కోట్లు
-హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్‌లో ఒక సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
-ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు ప్రత్యేక నిధి
-మృతదేహాలను తరలించేందుకు మరో నూతన 50 వాహనాలు ఏర్పాటు
-గర్భిణీలకు మూడు విడతలుగా రూ.12వేల ఆర్థిక సాయం. ఆడపిల్ల ప్రసవిస్తే మరో రూ.వెయ్యి అదనం.
-అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.7,500 నుంచి రూ.10,500 పెంచాం.
-అంగన్వాడీ సహాయకుల వేతనాలు రూ.4,500 నంచి రూ.5వేలకు పెంచాం

-పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది

-ఎన్నో రాష్ట్రాల కన్నా మన వృద్ధి రేటు ఎక్కువగా ఉంది
-ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేశాం
-ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించడమే కాకుండా, ఖర్చు అయ్యేలా చూస్తున్నాం
-పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదని మంత్రి ఈటెల బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు.

English summary
Finance minister Etela Rajender on Monday said that Telangana budget target is to develop poor people in the state. and he introduced budget in assembly on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X