స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకునేలా సర్కారు ప్రోత్సహం - సీఎం రేవంత్
స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకునేలా సర్కారు ప్రోత్సాహం అందిస్తామని సినీ ఇండస్ట్రీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో భాగంగా జరిగిన సినీ ప్రముఖుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీకి నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటీమణులు జెనీలియా, అక్కినేని అమలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
కాగా ఈ సమీక్షలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, చట్టపరమైన సౌకర్యాలు, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు, ట్రైనింగ్ సెంటర్లు, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫిల్మ్ ఎకో సిస్టంను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని ప్రకటించారు. షూటింగ్ పర్మిట్లు, లొకేషన్లు, సెక్యూరిటీ, మౌలిక వసతుల విషయంలో ఇకపై అడ్డంకులు ఉండవని తెలిపారు. ప్రత్యేకంగా సినిమా నిర్మాణంలో ఎదురయ్యే "ఫైల్ మూవ్మెంట్ డిలేలు" తొలగించే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు సూచించారు.

అంతే కాకుండా ఫ్యూచర్ సిటీని సినిమా, డిజిటల్ మీడియా, అనిమేషన్ రంగాలకు హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీలోనే ఏర్పాటు చేశామని, ఇందులో సినిమా 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టనున్నారని వెల్లడించారు. స్థానిక యువతను ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ వంటి అన్ని విభాగాల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. స్టూడియోలు నిర్మించదలచిన వారికి భూముల కేటాయింపు నుండి సబ్సిడీల వరకు ప్రతి రకమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సరస్సులు, కొత్త నిర్మాణాలు, IT కారిడార్ వంటి ప్రాంతాలను సినిమా షూటింగ్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌ను దక్షిణ భారతీయ సినిమాల ప్రధాన కేంద్రంగా మరింత బలపరచడం లక్ష్యమని స్పష్టం చేశారు. ఫిల్మ్ టూరిజం కోసం ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్లను ఆకర్షించేందుకు ఇన్సెంటివ్స్ను పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ ప్రకటనల పట్ల సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ సినీ రంగానికి పెద్ద ప్లాట్ఫారం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. స్టూడియోలు, వర్క్‌షాపులు, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పడితే హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఫిల్మ్ డెస్టినేషన్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.
-
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications