ఉద్యోగులకు ప్రభుత్వం న్యూ ఇయర్ కానుక - బకాయిలు విడుదల..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించింది. ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిలను వరుసగా విడుదల చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు మరో విడత నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులతో చర్చల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బకాయిలను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న బకాయిల పైనా స్పష్టత ఇచ్చారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల బకాయిల్లో ఈ నెల కూడా రూ.713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్ బిల్లులు వేలాది కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విడతలవారీగా బకాయిలను చెల్లిస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నవంబర్ నెల బకాయిలను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. కొత్త సంవత్సరం కానుకగా ఈ రోజునే విడుదల చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన చర్చలు చేసింది. అదే సమయంలో విడతల వారీగా బకాయిలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది.
ఉద్యోగ సంఘాలతో చర్చల వేళ ప్రభుత్వం ఒక డీఏ ప్రకటించగా.. పెండింగ్ బిల్లులు నెల చొప్పున విడుదల చేస్తామని నచ్చ చెప్పింది. గత నాలుగు నెలలుగా విడతలవారీగా ప్రభుత్వం క్లియర్ చేస్తున్న ఈ బిల్లులలో గ్రాట్యుటీ, GPF, సరెండర్ లీవ్ మరియు వివిధ అడ్వాన్స్‌లు ఉన్నాయి. అదే విధంగా ఈ నెల బకాయిల పైన ఉత్తర్వులు జారీ చేసారు. మిగిలిన బకాయిల ను ఇదే తరహాలో పూర్తిగా చెల్లింపులు చేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే, డీఏల పెండింగ్ అంశం పైన మరోసారి ప్రభుత్వంతో చర్చల దిశగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల వేళ.. ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications