రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక నుంచి కొత్తగా..!!
Ration supply: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరఫరాలో క్రమేణా మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పైన నిర్ణయం తీసుకుంది. కాగా.. బియ్యంతో పాటుగా మరో అయిదు నిత్యావసరాలను అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ పాలసీలో కొత్త మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే సమయంలో రేషన్ వ్యవస్థలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సన్న బియ్యం పైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మరో నాలుగు సరుకులను ఇవ్వాలని డిసైడ్ అయింది. త్వరలో రేషన్‌లో బియ్యంతోపాటూ.. పంచదార, గోధుమలు వంటి మొత్తం ఐదు రకాల నిత్యవసరాలను ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బహిరంగ మార్కెట్ లో సరుకుల ధరలు ఎక్కువగా ఉండటంతో.. రేషన్‌లో గోధుమలు, పంచదార, జొన్నలు, రాగులు లేదా చింతపండు, కందిపప్పు లాంటివి ఇవ్వటం ద్వారా పేదలకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఈ మేరకు ఈ సారి జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. వానాకాలం సీజన్లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణతో గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని రికార్డు నమోదైందని మంత్రి వెల్లడించారు.

మొత్తం ధాన్యం ఉత్పత్తిలో సగానికి పైగా.. అంటే 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలే ఉన్నాయని చెప్పారు. సాంబ మసూరి, తెలంగాణ మసూరి వంటి నాణ్యమైన రకాల సాగుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తందని వెల్లడించారు. రైతులకు మేలు జాతి విత్తనాలు అందించి, సన్న పంట సాగును విస్తరించాలన్నదే లక్ష్యమని మంత్రి తెలిపారు. ధాన్యం ఎక్కువైతే నిల్వ సవాల్ గా మారిందని.. దీంతో, గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 14.21 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి. వారి ఖాతాల్లో నేరుగా రూ.17,018 కోట్లను జమ చేసినట్టు తెలిపారు. సన్న బియ్యం పండించిన రైతులకు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున ఇప్పటివరకు రూ.1,425 కోట్ల బోనస్ అందించామని మంత్రి వెల్లడించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications