వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్కరాలు: మోతే, భద్రాచలంలో గవర్నర్ దంపతుల స్నానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ఖమ్మం: పుష్కరాలకు జనప్రవాహం పోటెత్తుతూనే ఉంది. మహాపుష్కరాల ఏడో రోజైన సోమవారం తెలంగాణలో సుమారు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు బూర్గంపాడు మండలం మోతె ఘాట్‌లో పుష్కరస్నానం చేసి భద్రాద్రి రాముణ్ని దర్శించుకున్నారు. పెద్ద జీయర్‌స్వామి భద్రాచలం సమీపంలో స్నానమాచరించి రామాలయాన్ని సందర్శించారు.

కరీంనగర్‌ జిల్లాలో ఆదివారాన్ని మించి సోమవారం 21.65 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కాళేశ్వరం, ధర్మపురి తదితర క్షేత్రాలకు రాయలసీమతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు. కోటిలింగాల, ధర్మపురి ప్రాంతాల్లో వాహనాలను ఒకే వరసలో

దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధర్మపురి చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పుష్కర ఘాట్లను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివారం వరకు 2.50 కోట్ల మంది పుష్కరస్నానం అచరించారని తెలిపారు.

మిగిలిన రోజుల్లో మరో మూడు కోట్ల మంది తరలివస్తారని అంచనావేయడమే కాకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరంలో సౌకర్యాలపై వైద్య ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పుట్టమధు, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు దృష్టిపెట్టారు.

భద్రాచలంలో గవర్నర్ దంపతులు

భద్రాచలంలో గవర్నర్ దంపతులు

పుష్కరాలకు జనప్రవాహం పోటెత్తుతూనే ఉంది. మహాపుష్కరాల ఏడో రోజైన సోమవారం తెలంగాణలో సుమారు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు.

గవర్నర్ దంపతులు

గవర్నర్ దంపతులు

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు బూర్గంపాడు మండలం మోతె ఘాట్‌లో పుష్కరస్నానం చేసి భద్రాద్రి రాముణ్ని దర్శించుకున్నారు.

గవర్నర్ దంపతులు

గవర్నర్ దంపతులు

పెద్ద జీయర్‌స్వామి భద్రాచలం సమీపంలో స్నానమాచరించి రామాలయాన్ని సందర్శించారు.

గవర్నర్ దంపతులు

గవర్నర్ దంపతులు

సోమవారం ఖమ్మం జిల్లాలో 4లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. భద్రాచలానికే 3లక్షల మంది తరలివచ్చారు.

మంత్రి లక్ష్మారెడ్డి

మంత్రి లక్ష్మారెడ్డి

ట్రాఫిక్‌ అంతరాయాలతో వృద్ధులు, చిన్నారులు అవస్థలుపడ్డారు.వరంగల్‌ జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం ఘాట్లలో 2లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

మంత్రి లక్ష్మారెడ్డి

మంత్రి లక్ష్మారెడ్డి

కరీంనగర్‌ జిల్లాలో ఆదివారాన్ని మించి సోమవారం 21.65 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.

మంత్రి లక్ష్మారెడ్డి

మంత్రి లక్ష్మారెడ్డి

కాళేశ్వరం, ధర్మపురి తదితర క్షేత్రాలకు రాయలసీమతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు. కోటిలింగాల, ధర్మపురి ప్రాంతాల్లో వాహనాలను ఒకే వరసలో

ధర్మపురి క్షేత్రంలో..

ధర్మపురి క్షేత్రంలో..

కరీంనగర్ జిల్లాలోని 39 పుష్కర ఘాట్లలో 17.34 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు.

ధర్మపురి క్షేత్రంలో..

ధర్మపురి క్షేత్రంలో..

ధర్మపురిలో 6.50 లక్షలు, కాళేశ్వరంలో 4.85, కోలింగాల 1.08, మంథనిలో 1.25 లక్షల మంది పుణ్యస్నానాలు అచరించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధర్మపురి చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పుష్కర ఘాట్లను సందర్శించారు.

పోచంపాడులో పోచారం

పోచంపాడులో పోచారం

కందకుర్తిలో 3.25లక్షల మంది స్నానాలు చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకే వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కర ఘాట్లకు చేరుకుని పుష్కర ఘాట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా పరిశీలించారు.

భద్రాచలంలో డిజిపి

భద్రాచలంలో డిజిపి

భద్రాచలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ.

English summary
Governor ESL Narsimhan couples participated in Telangana Pushkaralu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X