టార్గెట్ న్యూఇయర్: ముగ్గురు నైజీరియన్ల అరెస్ట్, రూ.కోటి విలువైన కొకైన్ సీజ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: న్యూఇయర్ నేపథ్యంలో మరోసారి నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. నూతన సంవత్సర వేడుకల్లో యువతే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలు భారీగా మాదక ద్రవ్యాలను నగారానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 225గ్రాముల కొకైన్, 30గ్రాముల హెరాయిన్ వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

 Three nigerians arrested for drugs supply

ఈ డ్రగ్స్ ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు? ఎవరికి పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారనే విషయంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపే అవకాశం ఉంది.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను కూడా విచారించిన విషయం తెలిసిందే. అంతేగాక, వందమందికిపైగా డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

కోటి రూపాయల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం: హైదరాబాద్ సీపీ

250గ్రామంల కొకైన్ పట్టుకోవడం ఇదే తొలిసారని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు తెలిపారు. అరెస్ట్ చేసిన ముగ్గురిలో జాన్ చుక్కూ అనే వాడు ప్రధాన నిందితుడని తెలిపారు. జాన్ కు బెనార్డ్ విల్సన్, మేసన్ లుకాస్ అనే ఇద్దరు సహకరిస్తున్నారని తెలిపారు. జాన్, లుకాస్.. స్టూడెంట్ వీసాపై మన దేశానికి వచ్చారని తెలిపారు.

గతంలో జాన్ పై పలు కేసులున్నాయని చెప్పారు. అతని వద్ద ఉన్న అసలు, నకిలీ పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నాట్లు తెలిపారు. బెనార్డ్ హెయిర్ బిజినెస్ అంటూ వచ్చి తన రూమ్మెట్ చార్లీ అనే వ్యక్తితో కలిసి డ్రగ్స్ సరఫరా చేశాడని తెలిపారు. ఘనా దేశానికి చెందిన లుకాస్ తన దేశానికి ఇక్కడ్నుంచి బట్టలు పంపిస్తూ.. అక్కడ్నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నాడని వెల్లడించారు.

అరెస్టైన ముగ్గురు నిందితులు కూడా బ్రోకర్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. కొకైన్ ను ఎవరికీ సందేహం కలగకుండా చాక్లెట్ కవర్లలో పెట్టి సరఫరా చేస్తున్నారని సీపీ తెలిపారు. కొలింబియాలో గ్రాం కొకైన ధర 3.2డాలర్లుగా ఉందని, అదే యూఎస్‌లో 300 డాలర్లు ఉందని చెప్పారు.

కాగా, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న 250గ్రాముల కొకైన నగరంలో అమ్మితే వీరికి సుమారు 99లక్షల రూపాయల వరకు వస్తాయని చెప్పారు. తాము డ్రగ్స్ పెడ్లర్, బ్రోకర్లపై దృష్టి సారించామని, వీరిని పట్టుకుంటేనే మొత్తం వ్యవహారం తేలుతుందని అన్నారు. డ్రగ్స్ వినియోగదారులపైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three nigerians arrested for drugs supply in Hyderabad on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి