దేవేందర్ గౌడ్‌తో భేటీ కానున్న రేవంత్ రెడ్డి... కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే ఛాన్స్...
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కీలక నేత దేవేందర్ గౌడ్‌తో ఆదివారం(జులై 18) భేటీ కానున్నారు. దేవేందర్ గౌడ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన తనయుడు వీరేందర్ గౌడ్,పెద్ద కుమారుడు విజయేందర్ గౌడ్‌లను రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్‌తో భేటీకి రేవంత్ వెంట కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్,ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు వెళ్లనున్నట్లు సమాచారం.
అనారోగ్య కారణాలతో దేవేందర్ గౌడ్ చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. క్యాన్సర్ వ్యాధి బారినపడిన ఆయన అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే దేవేందర్ గౌడ్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో రేవంత్ ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ విషయానికి వస్తే... రెండేళ్ల క్రితం ఆయన బీజేపీలో చేరారు. అంతకుముందు,2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి,2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో ఇక ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. వీరేందర్ గౌడ్‌ను కూడా రేవంత్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక పార్టీ బలోపేతంపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మొదట సొంత పార్టీలో సీనియర్లందరినీ కలిసి తాను అందరివాడిని సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి,జీవన్ రెడ్డి లాంటి కొందరు నేతలు ఆయన్ను దూరం పెట్టినప్పటికీ మిగతా సీనియర్లను కలిసి వారి సహకారాన్ని కోరారు. ఇదే క్రమంలో ఇతర గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ఆ తర్వాత పార్టీకి దూరమైనవారు,ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై రేవంత్ దృష్టి సారించారు. వీళ్లందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవేందర్ గౌడ్‌తో భేటీ కాబోతున్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications