హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతి పెద్ద విపత్తు నుంచి తెలంగాణను రక్షించాం

|
Google Oneindia TeluguNews

మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు శ్రేణుల ప్రచారం వల్లనే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

మునుగోడులో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తో కలిసి జగదీష్ రెడ్డి సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. నేతలకు సీపీఐ నేతలు ఘనస్వాగతం పలికారు. సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

trs leaders meet cpi leaders

భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. అతి పెద్ద విపత్తు నుంచి తెలంగాణను రక్షించామనే సంతోషం తమకుందని కూనంనేని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితంతో భారతీయ జనతాపార్టీకి ఎండ్‌ కార్డు పడిందన్నారు. కమ్యూనిస్టుల సహకారంతో మునుగోడు నియోజకవర్గాన్ని ప్రభాకర్ రెడ్డి బాగా అభివృద్ధి చేయాలని కోరారు. ఉభయ కమ్యూనిస్టుల సహకారంతో తాను మునుగోడును అభివృద్ధి చేస్తానని కూసుకుంట్ల ప్రకటించారు.

మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీనిచ్చినప్పటికీ గెలవలేకపోయారు. చౌటుప్పల్ మండలంపై తాము గంపెడాశలు పెట్టుకున్నామని, కానీ ఇక్కడి నుంచి తక్కువ ఓట్లు పోలైనట్లుగా కౌంటింగ్ రోజే అర్థమైందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

English summary
Minister Jagdish Reddy clarified that TRS candidate Kusukuntla Prabhakar Reddy won in the by-elections held in Munugodu constituency only because of the propaganda of communist ranks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X