వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాడు వైఎస్, నేడు కెసిఆర్!: వరుస షాక్‌లు, విపక్షాలు కుదేలు, ఏం చెప్పాలని జగ్గారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టిఆర్ఎస్ దెబ్బకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే వరంగల్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోను సీఎం కెసిఆర్ విపక్షాలకు ఊపిరాడనివ్వడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. అయినప్పటికీ టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కొన్నిచోట్ల బరిలోకి దిగాయి. మరికొన్ని చోట్ల స్వతంత్రులకు, ఇతరులకు మద్దతిచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే, వారికి సొంత పార్టీ నేతలే... ముఖ్యంగా అభ్యర్థులే షాక్ మీద షాక్ ఇస్తున్నారు.

నిన్నటికి నిన్న.. గురువారం నాడు వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. అక్కడ టిడిపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగలేదు. అయిదుగురు స్వతంత్రులు బరిలో నిలిచారు. వారికి విపక్షాలు మద్దతిచ్చాయి. అనూహ్యంగా అయిదుగురు కూడా గురువారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

Telangana

దీంతో, వరంగల్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళి ఏకగ్రీవం అవుతున్నారు. నిన్న స్వతంత్ర అభ్యర్థులు షాకివ్వగా... శుక్రవారం నాడు ఏకంగా పార్టీకి చెందిన వారే టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చేయిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడమే కాకుండా... ఏకంగా టిఆర్ఎస్ పార్టీలో చేరి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

వరంగల్ ఏకగ్రీవమని గురువారం నాడు తేలిపోయింది. శుక్రవారం నాడు మరో మూడు జిల్లాలు ఏకగ్రీవమని తేలిపోయాయి. శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లాలో టిడిపి అభ్యర్థి నారాయణ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అనంతరం కారు ఎక్కారు.

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ శివరాజ్ పాటిల్ నామినేషన్ ఉపసంహరించుకొని, వెంటనే తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ వ్యవహారం నుంచి కాంగ్రెస్ పార్టీ తేరుకోకముందే.. సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా అభ్యర్థి వెంకటరమణా రెడ్డి బరి నుంచి తప్పుకున్నారు.

ఈ లెక్కలతో... వరంగల్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. వరుస షాకుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అఫ్రమత్తమైంది. రంగారెడ్డి జిల్లా అభ్యర్థి చంద్రశేఖర్‌ను సంప్రదించారు. అయితే, తాను పోటీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. వైదొలిగే ఆలోచన లేదని చెప్పారు.

ఊహించలేదు: జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఈ పరిణామాల పైన స్పందించారు. మెదక్ జిల్లా అభ్యర్థి తప్పుకుంటారని ఊహించలేదని వాపోయారు. తాము ఇప్పుడు అధిష్టానానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురైందన్నారు. టిఆర్ఎస్ ప్రలోభ పెట్టి గెలవాలనుకుంటోందని మండిపడ్డారు.

తమ పార్టీ అభ్యర్థి టిఆర్ఎస్ ప్రలోభాలకు తలొగ్గాడన్నారు. అధికారం ఉందనే ఉహంతో అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గెలుస్తామన్న నమ్మకంతోనే తాము పోటీకి పెట్టామని, ఇప్పుడు అధిష్టానానికి ఏం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్‌కు కారణాలెన్నో...!

కాంగ్రెస్ పార్టీతో పాటు టిడిపికి షాక్ మీద షాకుకు కారణాలు ఎన్నో ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు 2014 ఎన్నికల సమయంలో వచ్చిన మెజార్టీ కంటే తక్కువ వచ్చినా కెసిఆర్ పాలనతో ప్రజలు విసుగెత్తారని భావించవచ్చునని, కానీ అప్పటి కంటే రికార్డ్ మెజార్టీ వచ్చిందని దీంతో కాంగ్రెస్, టిడిపి నేతలు పునరాలోచన చేస్తున్నారని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేని పరిస్థితి ఎదురైందని, దీంతో కొన్ని స్థానాల్లో పోటీ చేయలేకపోయిందని, అలాగే, ఎలాగూ ఓడిపోతామని మొక్కుబడిగానే అభ్యర్థులను నిలబెట్టిందని అందుకే, ఇలా జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వరంగల్ ఉప ఎన్నిక, అభ్యర్థులు దొరకకపోవడం, మొక్కుబడి పోటీ ప్రభావం పడిందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని విపక్షాలు ఉన్నాయని చెబుతున్నారు. టిడిపి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఏమీ లేదని అంటున్నారు.

కాగా, ప్రస్తుతం టిఆర్ఎస్ నేతల వలసలు చూస్తుంటే, 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వలసలను గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. వైయస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

English summary
Telangana Rastra Samithi Wins 4 district MLC's Unanimously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X