కలకలం: ఇద్దరు కాలేజీ విద్యార్థినుల అదృశ్యం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడలో ఇద్దరు కళాశాల విద్యార్ధినులు అదృశ్యమయ్యారు. రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న చామంతి(18), దివ్య(20) అనే ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం నుంచి కనిపించడం లేదు.

కాలేజీ ముగిసిన తర్వాత కూడా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Two college students missing in Narayanaguda

ఓ యువతిని కాపాడిన భద్రతా సిబ్బంది

కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని గురువారం కరీంనగర్‌ నుంచి నగరానికి వచ్చింది. ఓ హోటల్‌లో అద్దెకు దిగి శుక్రవారం తెల్లవారుజామున ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. ఉదయం 7.20 ప్రాంతంలో ఒక్కసారిగా నీళ్లల్లోకి దూకింది.

కాగా, గమనించిన ఓ టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ హుటాహుటిన నీళ్లల్లో దూకి రక్షించే ప్రయత్నం చేశాడు. యువతి బయటకు రావడానికి నిరాకరిస్తూ నీళ్లల్లోకి వెళ్లిపోతుంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఓ ఉద్యోగి వాళ్లను గమనించి తనూ నీళ్లలోకి దూకాడు. ఇద్దరు కలిసి ఆ యువతిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. లేక్‌ సీఐ ధనలక్ష్మి ఆధ్వర్యంలో యువతికి లేక్‌పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి భరోసా కేంద్రానికి పంపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two college girls students missing in Narayanaguda in Hyderabad on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి