వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమా మాధవరెడ్డి: 'టిఆర్ఎస్‌కు నో చెప్పడానికి కారణమిదే, ఆలోచిస్తా'

మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి టిడిపిని వీడుతారా అనే చర్చ ఇటీవట కాలంలో జోరుగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి స్పస్టమైన హమీ రాలేదనే విషయాన్ని ఉమా మాధవరెడ్డి తేల్చి చెప్పారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి టిడిపిని వీడుతారా అనే చర్చ ఇటీవట కాలంలో జోరుగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి స్పస్టమైన హమీ రాలేదనే విషయాన్ని ఉమా మాధవరెడ్డి తేల్చి చెప్పారు. అయితే గతంలో కూడ టిఆర్ఎస్‌లో చేరాలని ఆమెకు ఆ పార్టీ నాయకత్వం కోరింది. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరలేదనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే మరోసారి టిఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వనిస్తే ఆలోచిస్తానని ఉమా మాధవరెడ్డి ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

చదవండి: టీడీపీ పనైపోయిందని తెలుసు, రేవంత్ వెంటే వెళ్లేదాన్ని: బాబుకు ఉమామాధవరెడ్డి షాక్

తెలంగాణలో టిడిపికి చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ సమయంలో చాలా కాలంగా ఉమా మాధవరెడ్డి కూడ టిడిపిని వీడుతారానే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను ఆమె ఖండిస్తున్నారు.

అయితే అసెంబ్లీలో తెలంగాణ సీఎం కెసిఆర్‌ను నవంబర్ 17వ, తేదిన కలిశారు. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఆమె కెసిఆర్‌ను కలిశారు.అయితే మావోయిస్టుల చేతిలో మరణించిన నేతల కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయించే విషయమై కెసిఆర్‌కు ఉమా మాధవరెడ్డి వినతిపత్రం సమర్పించారు.

ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరకపోవడానికి కారణమిదే

ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరకపోవడానికి కారణమిదే


ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న మాధవరెడ్డిని మావోయిస్టులు మందుపాతర పేల్చి హతమార్చారు. అయితే ఈ స్థానంలో జరిగిన ఎన్నికల్లో ఉమా మాధవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొంతకాలానికే మంత్రిగా కూడ ఆమె బాధ్యతలు నిర్వహించారు. అయితే మాధవరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి కుటుంబం ఉమా మాధవరెడ్డితో విబేధించింది. దీంతో కృష్ణారెడ్డి టిఆర్ఎస్‌లో చేరారు.దీంతో వీరిద్దరి మధ్య విబేధాలున్నాయి. కృష్ణారెడ్డిని టిఆర్ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యుడిగా కెసిఆర్ నియమించారు.

 2014లో పైళ్ళ శేఖర్ రెడ్డి రంగంలోకి

2014లో పైళ్ళ శేఖర్ రెడ్డి రంగంలోకి

2014 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పైళ్ళ శేఖర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. మాధవరెడ్డి మరణించిన తర్వాత 2014 ఎన్నికల వరకు ఉమా మాధవరెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉమా మాధవరెడ్డికి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి కూడ ఆహ్వనాలు వచ్చాయనే ప్రచారం సాగింది. అయితే ఈ రెండు పార్టీల నుండి స్పష్టమైన హమీ లేనందునే ఆమె టిడిపిని వీడలేదనే ప్రచారం కూడ సాగుతోంది.

కాంగ్రెస్‌లో ఉమా మాధవరెడ్డికి లైన్ క్లియర్

కాంగ్రెస్‌లో ఉమా మాధవరెడ్డికి లైన్ క్లియర్

భువనగరి అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. అయితే భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఇంఛార్జీ లేరు. అయితే అదే సమయంలో ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు భువనగిరి టిక్కెట్టును కేటాయించే విషయమై హమీ లభిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఆలోచించనుందనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి హమీ లభించినందునే ఆయన ఆ పార్టీలో చేరారని, కానీ, తనకు ఎలాంటి హమీ లేదని ఉమా మాధవరెడ్డి స్పష్టం చేశారు.

టిఆర్ఎస్‌లోకి మళ్ళీ ఆహ్వనిస్తే

టిఆర్ఎస్‌లోకి మళ్ళీ ఆహ్వనిస్తే

టిఆర్ఎస్‌లో చేరాలని ఉమా మాధవరెడ్డికి ఆహ్వనం వస్తే ఆమె ఏం చేస్తోందోననే చర్చ సాగుతోంది.సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కాదని ఉమా మాధవరెడ్డికి కేటాయించే అవకాశం ఉండదు.అయితే భువనగిరి ఎంపీగా బూర నర్సయ్యగౌడ్‌ను కాదని ఉమా మాధవరెడ్డికి టిక్కెట్టు కేటాయించే అవకాశం లేదు. అయితే కృష్ణారెడ్డితో ఉమా మాధవరెడ్డికి విబేధాలున్నాయి. అయితే టిఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వనిస్తే ఆలోచిస్తానని ఉమా మాధవరెడ్డి ప్రకటించడం ఆసక్తిగా మారింది.

English summary
Everyone knows TDP is finished. Revanth Reddy may have got specific promises for joining Congress but I am not given. How will join the party? If I got, I would have been on the same flight as Revanth. I was invited into TRS in the last elections. If I get an invite now, I will consider,” Uma Madhava reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X