'నరసింహన్ ఉన్నంత కాలం ఏపీ, తెలంగాణకు అన్యాయమే!, రాజ్‌కు లేఖ'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నరసింహన్ గవర్నర్‌గా ఉన్నంత కాలం తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగదని, ఆయనను కొనసాగించవద్దని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బుధవారం అన్నారు.

గవర్నర్‌గా నరసింహన్: తాత్కాలిక పొడిగింపు, కేంద్రం ప్లాన్ ప్రకారమే..

ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌గా నరసింహన్‌ ఉన్నంత వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏమాత్రం న్యాయం జరగదని చెప్పారు.

తమ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, నిరూపిస్తానని చెబుతున్నారనీ, ప్రభుత్వం మీదే గనక దానిపై విచారణ జరిపించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

ఏడేళ్లుగా గవర్నర్‌గా..

ఏడేళ్లుగా గవర్నర్‌గా..

గత ఏడేళ్లుగా ఏపీ గవర్నరుగా కొనసాగుతున్న నరసింహన్‌ను మరికొంత కాలం కొనసాగించేందుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపిన విషయం తెలిసిందే. పదవీకాలం ముగిసిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయన్నే కొనసాగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.

యూపీఏ ప్రభుత్వం నియమించింది

యూపీఏ ప్రభుత్వం నియమించింది

ఈ మేరకు హోంశాఖ అధికారులు ఆయనకు సమాచారం పంపించారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నరుగా ఉన్న నరసింహన్‌కు అప్పటి యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబరు 27న ఆంధ్రప్రదేశ్‌ అదనపు బాధ్యతలు అప్పగించింది.

సుదీర్ఘకాలం గవర్నర్‌గా...

సుదీర్ఘకాలం గవర్నర్‌గా...

2010 జనవరి 23న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయి గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో సుదీర్ఘకాలంగా గవర్నరు పదవిలో కొనసాగుతున్న వారి జాబితాలో నరసింహన్‌ తొలిస్థానంలో ఉన్నారు. 2007 జనవరి 19 నుంచి (ఛత్తీస్‌గఢ్‌తో కలిపి) ఈ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు.

మిగతా రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు..

మిగతా రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు..

జమ్ము కాశ్మీర్‌ గవర్నరుగా ఎన్‌ఎన్‌ ఓహ్రా 2008 జూన్‌ 25 నుంచి ఆ పదవిలో ఉన్నారు. మిగతా రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల ఉమ్మడి గవర్నరుపైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress party senior leader V Hanumantha Rao on Wednesday lashed out at Governor Narasimhan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి