Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమానుషం: గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే.. బూటు కాలితో తన్నిన సర్పంచ్(వీడియో)

హైదరాబాద్: గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరిన ఓ వ్యక్తిపై స్థానిక సర్పంచ్ దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా బూటుకాలుతో ఎగిరి తన్నాడు. ఈ అమానుష ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దామస్తాపూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో ఊరికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించాడు. గ్రామ సమస్యలు చాలా వున్నాయ్.. నీటి సమస్య, డ్రైనేజి సమస్య వంటివాటి మీద ద‌ృష్టి పెట్టాలని దామస్తాపూర్ సర్పంచ్‌కు పిట్టల శ్రీనివాస్ మొరపెట్టుకున్నాడు.

Vikarabad: damastapur sarpanch kicked a villager, who questioned on village issues, with shoe foot

అక్కడే రెండు రోజుల క్రితం జరిగిన ఒక గొడవ కోసం పంచాయితీ పెట్టిన సర్పంచ్ జైపాల్ రెడ్డి.. నీకెందుకు రా? అంటూ కొట్టడం.. బూటుకాలితో బురదలో వేసి తన్నడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అతడి తలపై కొట్టాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన పిట్టల శ్రీనివాస్.. గ్రామ సమస్యలు అడగడానికి వస్తే ఇట్లా తనను కొట్టి వెళ్లగొడతారా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు శ్రీనివాస్ వెళ్లి సర్పంచ్ మీద ఫిర్యాదు చేశాడు. మర్పల్లి ఎస్ఐ వెంకట శ్రీనుకు తన ఫిర్యాదును సమర్పించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడీసీల ఆగడాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ(వీడీసీ)లు జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామంలో వడ్డెర కులస్తులను బహిష్కరించారు. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న వీడీసీ ఏకంగా 150 వడ్డెర కుటుంబాలను బహిష్కరించించి. దీంతో తమకు జరిగిన అన్యాయం గురించి జిల్లా కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు.

విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ఆగడాలు పెరిగిపోవడంతో స్పందించిన అధికారయంత్రాంగం అనేక మందిపై క్రిమినల్ కేసులు పెట్టింది. పలు కమిటీలను రద్దు చేసింది. అయినా మళ్లీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం ఎర్పడిన గ్రామ అభివృద్ది కమిటిలు కొన్ని గ్రామాల్లో తమ అధికారంతో కొన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపనలు వినిపిస్తున్నాయి.

తాము చెప్పిందే వేదంగా గ్రామంలో రాజకీయ కక్ష్యలతో పాటు సామాజిక విభేదాలను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు గ్రామ అభివృద్ది కమిటీ తీరు వివాదస్పదం అవుతోంది. పలు గ్రామాల ప్రజలు కమిటీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిజామాబాద్ రూరల్ జిల్లాలోని ఆర్మూర్, వేల్పూర్, ఇతర గ్రామాల్లోని పలు కమిటిల ఆగడాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి వ్యవహారంతో మరోసారి వీడీసీల ఆగడాలు బయటపడ్డాయి. గ్రామంలో సుమారు 150 కుటుంబాలను ఓ వివాదంలో బహిష్కరించారు. వారికి వివిధ పనుల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వడ్డెర కుటుంబాలకు చెందిన గ్రామస్థుడు చనిపోతే... అత్యక్రియలకు కావాల్సిన వస్తువులు ఇచ్చేందుకు ఆ గ్రామస్థులు నిరాకరించారు. తమతో మాట్లాడితే 10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో దిక్కుతోచన స్థితిలో ఆ వడ్డెర కుటుంబాలు తమ ఆవేదనను జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. వీడీసీల తీరుపై జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. ఇప్పటికైనా వీడీసీల ఆగడాలు తగ్గుతాయని బాధితులు ఆశిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+