హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి మొట్టికాయ, తెలంగాణ ప్రజాఫ్రంట్ నిలదీత: 'రూ.140 లక్షల కోట్ల సంపదపై కన్ను'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మావోయిస్టు ఆర్కేను (రామకృష్ణ) కోర్టులో హాజరుపర్చాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక సోమవారం నాడు డిమాండ్ చేసింది. హత్యా నేరం కింద పోలీసుల పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హరగోపాల్, సంధ్యక్క తదితరులు విలేకరులతో మాట్లాడారు.

ఆర్కేకు ఎలాంటి హాని తలపెట్టొద్దు: ఏపీకి హైకోర్టు ఆదేశంఆంధ్రా - ఒడిశా సరిహద్దులో (ఏవోబీ) ఎన్‌కౌంటర్ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఏవోబీలో రూ.140 లక్షల కోట్ల ఖనిజ సంపద పైన కన్నేసారని మండిపడ్డారు. ఆర్కే సహా మరికొంతమంది పోలీసుల అదుపులోనే ఉన్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.

 Where is RK?: TPF questiones AP government

ఏవోబీ ఎన్‌కౌంటర్ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, చిక్కుడు ప్రభాకర్ వేరుగా డిమాండ్ చేశారు. ఏవోబీలో రూ.140 లక్షల ఖనిజ సంపద పైన కన్నేశారని ఆరోపించారు. ఆర్కే సహా మరికొంతమంది ఏపీ పోలీసుల అదుపులోనే ఉన్నారన్నారు. ఏవోబీ ఎన్‌కౌంటర్ పైన ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని వారు అన్నారు.

కాగా, ఆర్కే భార్య శిరీష వేసిన పిటిషన్ పైన విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, సాధారణ పౌరుడైనా, మావోయిస్టు అయినా వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆర్కే చనిపోయాడా లేక పోలీసుల కస్టడీలో ఉన్నాడా చెప్పాలని సూచించింది.

English summary
Telangana Praja Front questioned AP government over Maoist Ramakrishna(RK).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X