కేన్సర్‌ను జయించారు: విన్నర్ వాక్‌లో ముమైత్ ఖాన్, గౌతమి, జయసుధ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్డులో ఆదివారం ప్రముఖ తారలు సందడి చేశారు. విన్నర్ వాక్‌లో పాల్గొన్నారు. జలవిహార్ నుంచి విన్నర్ వాక్ నిర్వహించారు.

  Life Again Foundation's Winners Walk : బాహుబలి కల్పవల్లి ఆవేదన | Oneindia Telugu
  విన్నర్ వాక్‌లో ప్రముఖులు

  విన్నర్ వాక్‌లో ప్రముఖులు

  ఈ వాక్‌ను తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ గౌడ్, నటుడు నరేష్, నిన్నటి తరం హీరోయిన్లు జయసుధ, గౌతమి, ప్రత్యేక నృత్య కళాకారిణి ముమైత్ ఖాన్‌లు ప్రారంభించారు. ఈ వాక్‌లో పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు.

  ముమైత్ ఖాన్, గౌతమి మోటార్ సైకిళ్లపై రావడంతో కేరింత

  ముమైత్ ఖాన్, గౌతమి మోటార్ సైకిళ్లపై రావడంతో కేరింత

  ముమైత్ ఖాన్, గౌతమిలు మోటార్ సైకిళ్లపై రావడంతో యువత కేరింతలు కొడుతూ వారిని అనుసరించారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం నటి గౌతమి, హైమారెడ్డి నిర్వహిస్తున్న లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్ ఈవెంట్‌లో పైవారంతా పాల్గొన్నారు.

  లైఫ్ ఎగైనా ఫౌండేషన్

  లైఫ్ ఎగైనా ఫౌండేషన్

  క్యాన్సర్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం లైఫ్ ఎగైన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విన్నర్స్ వాక్ నిర్వహించారు.

  క్యాన్సర్ జయించిన వారు వచ్చారు

  క్యాన్సర్ జయించిన వారు వచ్చారు

  కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నుంచి క్యాన్సర్‌ను జయించిన వారు వచ్చారు. కేవలం క్యాన్సర్ ను జయించిన వారే కాకుండా, ఎంతో మంది స్వచ్చంధ సంస్దల ప్రతినిధులు ఈ వాక్‌లొ పాల్గొన్నారు. ఉదయం కు జలవిహార్ వద్ద ప్రారంభమై పీపుల్ ప్లాజా వద్ద ముగిసింది.

  చాలాకాలం తర్వాత జయసుధ

  చాలాకాలం తర్వాత జయసుధ

  తన భర్త చనిపోయిన తర్వాత అన్నీ కార్యక్రమాలకు సినిమాలకు దూరంగా ఉన్న జయసుధ ఇన్నాళ్లకు మళ్లీ ఓ కార్యక్రమంలో కనిపించారు. జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య విషయం సంగతి తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Cine Stars Jayasudha, Gauthami, Mumaith Khan, Naresh, Deputy Speaker Padma Devender Reddy were participated in Winner Walk in Hyderabad.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి