డ్రామాలు ఆపి.. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఆ హామీ నెరవేర్చండి... కేసీఆర్‌కు షర్మిల డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కారణంగానే కేసీఆర్‌కు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయని కేసీఆర్... ఓట్ల కోసమే దళిత బంధు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఏనాడు అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయని దొర ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా డ్రామాలు ఆపి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

డ్రామాలు ఆపి.. ఆ హామీ నెరవేర్చండి : వైఎస్ షర్మిల
'ఏడేండ్లలో ఎప్పుడూ అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని దొర ఇప్పుడు పొర్లు దండాలు పెడుతుండు. సీఎంవోలో ఒక్క దళిత ఆఫీసర్‌ను పెట్టుకోని సారు ఇప్పుడు దళిత ఆఫీసర్లని నెత్తిల పెట్టుకుంటున్నడు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చెయ్యని సారు దళిత ఓట్ల కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనడు. ఈ ప్రేమంతా హుజురాబాద్ ఎన్నికల మహిమ.మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే... ఈ డ్రామాలు ఆపి... ఐదేండ్ల కింద అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు హామీ ఇచ్చిన.. మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేసి.. 20 వేల మంది దళితులకు ఉపాధి చూపండి. అని షర్మిల డిమాండ్ చేశారు.

ఐదేళ్ల క్రితం లెదర్ పార్క్ ఏర్పాటుకు హామీ...
స్టేషన్ ఘన్‌పూర్‌లో మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ 2016లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఐదేళ్లు గడిచినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వం ఆ హామీని మరిచిపోయిందా లేక పట్టించుకోవట్లేదా తెలియదు గానీ మళ్లీ ఆ ఊసే ఎక్కడా వినిపించట్లేదు.ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల మెగా లెదర్ పార్కు ఏర్పాటుకు డిమాండ్ చేశారు.ఐదేళ్ల క్రితం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో లెదర్ పార్క్ ఏర్పాటుకు 117 ఎకరాల స్థలం సేకరించామని తెలిపారు. సుమారు రూ.270కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నామని... ఇందుకోసం రూ.105 కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తున్నామని చెప్పారు. ఈ మెగా లెదర్ పార్కుకు అనుబంధంగా మరో 9 మినీ లెదర్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రెండేళ్లలోనే వీటన్నింటినీ పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. కానీ ఆ హామీ ఇప్పటికీ అమలు అవలేదు.
Recommended Video

రోడ్ల పక్కన చెప్పులు కుట్టుకుంటున్నారు...
గతంలో లిడ్ క్యాప్(లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్) ఆధ్వర్యంలో ఆఫీసర్లు వివిధ జిల్లాల నుంచి 2వేల మంది నిరుద్యోగ యువతను ఎంపిక చేసి చెన్నైలో శిక్షణ ఇప్పించారు. లెదర్ పార్క్‌ల ఏర్పాటు తర్వాత అందులో వారికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. కొన్నిచోట్ల మినీ లెదర్ పార్క్‌లను ఏర్పాటు చేసి వారిలో కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ పార్క్‌లు నడవలేదు. దీంతో వారు ఉద్యోగాలు కోల్పోయారు. ఆ శిక్షణ తీసుకున్నవారిలో చాలామంది రోడ్ల పక్కన చెప్పులు కుట్టుకుంటున్నారు.రాష్ట్రంలో లెదర్ ఉత్పత్తుల బిజినెస్ ఏటా వేల కోట్ల రూపాయలు. స్థానికంగా లెదర్ పరిశ్రమలు లేకపోవడంతో నార్త్ ఇండియా నుంచే దిగుమతి జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే 9 మినీ లెదర్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వాటిని త్వరగా పూర్తి చేసి ఉపాధి కల్పిస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకునే పరిస్థితి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications