తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో ఆర్జిత సేవలు పున:ప్రారంభం.. కానీ ఆ రోజుల్లో నో..

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు తగ్గడంతో ఆర్జిత సేవలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇచ్చింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభిస్తారు. గురువారం టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల‌కు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. మార్చి 20వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు నుంచి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలక్ట్రానిక్ డిప్ విధానం

ఎలక్ట్రానిక్ డిప్ విధానం

సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, నిజ‌పాద ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్ల కేటాయింపు జ‌రుగుతుంది. టికెట్లు పొందిన‌వారి జాబితాను మార్చి 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల త‌రువాత వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తారు. భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది. క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల‌ను ముందు వ‌చ్చిన వారికి ప్రాతిప‌దిక‌న‌ భ‌క్తులు నేరుగా బుక్ చేసుకోవ‌చ్చు.

 పండగల సమయంలో మాత్రం నో

పండగల సమయంలో మాత్రం నో


పండుగల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 2న ఉగాది సంద‌ర్భంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వంను రద్దు చేయగా, ఏప్రిల్ 10న శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా తోమాల‌, అర్చ‌న‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలను రద్దు చేశారు. వ‌సంతోత్స‌వాల సంద‌ర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవల‌ను, ఏప్రిల్ 15న నిజ‌పాద ద‌ర్శ‌నం సేవ‌లను ర‌ద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Recommended Video

Telangana Assembly ఆవరణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు .. గ్రౌండ్ రిపోర్ట్ | Oneindia Telugu
నెగిటివ్ సర్టిపికేట్ తప్పనిసరి

నెగిటివ్ సర్టిపికేట్ తప్పనిసరి


శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాల సంద‌ర్భంగా మే 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌లు ర‌ద్ద‌య్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇటు తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్.. లేదంటే రెండు డోసుల వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ స్పష్టంచేసింది. ఇప్పడైతే కరోనా ప్రభావం అంతగా లేదు. సో భక్తులు కూడా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్నారు.

English summary
arjitha seva start soon at tirumala ttd said in the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X