విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో దంచికొట్టిన వాన.. గంటపాటు ఏకధాటిగా వర్షం..

|
Google Oneindia TeluguNews

జూన్ మూడో వారం వచ్చిన ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. రుతు పవనాల రాక మరింత ఆలస్యమైంది. అయితే ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడగా.. ఏపీలో కూడా వర్షం కురిసింది. ముఖ్యంగా అమరావతి, విజయవాడలో వర్ష బీభత్సం కొనసాగింది. బెజవాడలో కుండపోత వాన పడటంతో.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

గత కొన్ని వారాలుగా ఎండలతో అల్లాడిపోయిన విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీవర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, రాణిగారితోట, ఎంజీ రోడ్, కృష్ణలంక, ఏలూరు రోడ్, మొగల్రాజపురంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. జలాలు భూగర్భంలోకి చేరాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.

heavy rainfall at vijayawada town. people are happy to see the rain.

విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. నీళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. ఇవాళ కురిసిన వర్షాలకు డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వీధులు అన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. వర్షంతో వాతావరణం చల్లబడింది.

వర్షం కురవకముందు ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. వరుణ దేవుడా కురుణించి అని వేడుకున్నారు. దీంతో వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు మూడు రోజులు ఇలానే వర్షం కురవాలని కోరుతున్నారు. ముసురు పట్టిన భూతాపం తగ్గుతుందని దీంతో ఉక్కపోత బాధ తప్పుతుందని పేర్కొంటున్నారు.

English summary
heavy rainfall at vijayawada town. people are happy to see the rain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X