ఫేక్ కన్సల్టెన్సీ భాగోతం.. వెలుగులోకి తెచ్చిన అమెరికా ఎంబసీ, పరారీలో నిర్వాహకులు
కన్సల్టెన్సీల మోసాలు ఆగడం లేదు. అమాయకులను చూసి ఛీట్ చేస్తుంటారు. ఫేక్ సర్టిపికేట్స్‌తో విదేశాలకు పంపిస్తున్నారు. అయితే ఇలా మోస పోవడం యువత వంతు అవుతుంది. దీనిపై ఎంత అలర్ట్ చేసినా.. మోసాలు తగ్గడం లేదు. విజయవాడలో ఇలాంటి ఓ ఫేక్ కన్సల్టెన్సీ భాగోతం బయటపడింది. నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గల విద్యార్థులను ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తామని కన్సల్టెన్సీ చేస్తున్న మోసం చేస్తోంది. అలా ఓ కన్సల్టెన్సీ మోసాన్ని అమెరికన్ ఎంబసీ వెలుగులోకి తెచ్చింది. విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తున్నారు. ఇందులో ప్రధాన వ్యక్తిగా ముళ్లపూడి కేశవ్ ను గుర్తించారు. మంగళవారం ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్.. విజయవాడ వచ్చి స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలో తనిఖీలు నిర్వహించింది. కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం.

స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీకు వెళ్లి సేకరిస్తుండగా మీడియా మిత్రులను బయటకుపంపించి వేశారు. తర్వాత సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. ఆ కంపెనీ ఎండీ కేశవ్ ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తోంది. తర్వాత అందుబాటులో లేకుండాపోయారు. అన్యాయంపై నిలదీసేందుకు బాధిత తల్లిదండ్రులు స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ చుట్టూ తిరుగుతున్నారు. అయినా వారికి జస్టిస్ జరగడం లేదు.
విదేశాల్లో చదువు, ఉద్యోగం పేరుతో యువత అట్రాక్ట్ అవుతుంటారు. పేరంట్స్ కూడా అప్పో సప్పో చేసి పంపిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లాక పర్మిషన్ లేదని.. ఇతర కారణాలు చెప్పడంతో స్టూడెంట్స్ ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇక్కడ ఉన్న పేరంట్స్‌కు చెప్పగా వారు ఆఫీసులకు వెళ్లి ఆరాతీయగా.. అబ్బే అదేం లేదని అంటున్నారు. అప్పటికే నగదు మొత్తం దండుకుంటున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.