• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Black Fungus Vizag Case Study:యాంఫోటెరిసిన్ అప్రూవల్ కోసం ఎదురు చూసి... కోమాలోకి: అధికారులు స్పందించండి

|

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు బాగానే బయటపడుతున్నాయి. బ్లాక్ ఫంగస్‌ జబ్బును ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నట్లు చెప్పి జగన్ సర్కార్ కొంత ఊరట కల్పించినప్పటికీ... చికిత్సవరకు వచ్చే సరికి బ్లాక్ ఫంగస్ వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇందుకు కారణం బ్లాక్ ఫంగస్‌కు చికిత్సలో భాగంగా ఇచ్చే యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ కొరత కనిపిస్తోంది. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఓ 62 ఏళ్ల వ్యక్తి (కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పేషంట్ పేరు బయట పెట్టడం లేదు) బ్లాక్ ఫంగస్ బారిన పడి సరైన సమయంకు యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ దొరక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే పేషెంట్ కుటుంబ సభ్యులు యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్ కోసం ప్రయత్నించారు. అది ప్రభుత్వం మాత్రమే సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఆ ఇంజెక్షన్ కోసం ప్రయత్నించారు.

వివరాల్లోకి వెళితే... మే 6వ తేదీన విశాఖకు చెందిన 62 ఏళ్ల వ్యక్తిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడటం ప్రారంభించారు. అయితే తగ్గకపోవడంతో హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించారు. ఆ సమయంలో స్టెరాయిడ్స్‌తో ట్రీట్‌మెంట్ చేశారు. 9వ తేదీన తలనొప్పిగా ఉందంటూ పేషెంట్ చెప్పారు. ఆ తర్వాత కంటి వాపును గమనించారు. అయితే వైద్యులు ఎంఆర్‌ఐ సూచించడంతో ఎంఆర్ఐ తీశారు. అదే సమయానికి కన్ను పూర్తిగా మూసుకుపోయింది. కనుచూపు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్‌ చికిత్సలో భాగంగా వినియోగించే యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్ ప్రభుత్వం మాత్రమే సప్లయ్ చేస్తుందని ప్రైవేట్ హాస్పిటల్ వారు చెప్పడంతో... ఆ ఇంజెక్షన్ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే ఆ ఇంజెక్షన్ దొరకాలంటే పలువురు ప్రభుత్వ అధికారుల అనుమతులు ఉండాలని చెప్పడంతో ఆ అనుమతుల కోసం ప్రయత్నించారు.

Visakhapatnam:Delay in supply of Blackfungus injection,Doctors remove patient eye

ముందుగా చికిత్స అందిస్తున్న డాక్టరు నుంచి పేషెంట్‌ మ్యూకోర్‌మైకాసిస్ బారిన పడ్డారని అతనికి యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉన్నందున వెంటనే సప్లయ్ చేయాలని చెబుతూ ఒక లేఖ లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకున్నారు. అది తీసుకుని విశాఖ డీఎంహెచ్‌ఓకు వెళ్లి యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క డీహెచ్ఎంఓలోనే కాదు.. కలెక్టర్ కార్యాలయంలో, డీసీహెచ్ఎస్, ఏడీ డ్రగ్స్‌లో కూడా ఇంజెక్షన్ కోసం అప్లయ్ చేశారు. ఈ లోగా పేషెంట్‌లో ఇన్‌ఫెక్షన్ లెవెల్స్ పెరిగిపోతుండటంతో వైద్యులు ఎడమవైపు కన్నును తీసేశారు. ఇన్‌ఫెక్షన్ మరో కన్నుకు సోకకుండా ఉండేందుకు ఈ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇక బాగానే ఉన్నారని అనుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం పేషెంట్ అపోలో హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై ఉంటూ ప్రాణం కోసం పోరాడుతున్నారు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ కోసం దరఖాస్తు పెట్టినప్పుడే అధికారులు ఇచ్చి ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని పేషెంట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఈ అనుమతులు పొందడంలోనే దాదాపు మూడు రోజులు గడిచిపోయాయని ఆ లోగ తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్రమంగా దెబ్బతినిందని కొడుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై మరొకరికి ఇలా జరగకుండా అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి కావాల్సిన అనుమతులు ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

  Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu
  English summary
  Govt officials sheer negligence over providing Amphotericin B injection had put the patients life at risk.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X